వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎట్టకేలకు నిజం ఒప్పుకున్నారు. టీఎన్‌ఎస్ఎఫ్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడిపై ఇటీవల హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేసులో నిందితులు తనవాళ్లేనని ఆయన అంగీకరించారు.

గురువారం ఈ కేసు విషయమై మీడియాతో మాట్లాడిన కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ కేసులో నిందితులు తన అనుచరులేనని, దీనిలో రెండో ఆలోచనకు తావు లేదన్నారు. తానేమీ దాచి పెట్టడం లేదని.. ఈ కేసులో అరెస్టైన వారంతా ఎన్నికల్లో తనతోపాటు పనిచేసిన వారేనన్నారు. 

దాడులను, రౌడీ రాజకీయాలను ప్రోత్సహించబోనన్న ఆయన తిరుమలనాయుడిపై దాడిని తన వాళ్లే చేశారన్న దానిపై ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయన్నారు. అయితే పోలీసులు చెబుతున్నారు కాబట్టి నమ్ముతున్నానన్నారు.