దేశంలో చరిత్రహీన చక్రవర్తి చంద్రబాబు అని వైసీపీఎమ్మెల్యే ఐజయ్య ఆరోపించారు. చంద్రబాబు ఏపీలో రాజ్యాంగ విలువలను సర్వనాశనం చేసి.. తెలంగాణలో పెత్తనం చేయాలనుకుంటున్నాడని విమర్శించారు. ఈ రోజు కర్నూలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐజయ్య పాల్గొని ప్రసంగించారు.

రాజ్యాంగానికి తూట్లు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. నిన్నటి దాకా.. బీజేపీతో పొత్తు పెట్టుకొని.. ఇప్పుడు సిగ్గులేకుండా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారన్నారు. మహాకూటమి సహాయంతో.. తెలంగాణలో పెత్తనం చేయాలని చంద్రబాబు ఆరాటపడుతున్నాడని ధ్వజమెత్తారు.

ఏపీలో వైసీపీ జెండాతో గెలిచిన 23మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నాడని విమర్శించారు. స్పీకర్ స్థానాన్ని కూడా అపహాస్యం చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శించారు. ఏపీలో త్వరలో వచ్చే ఎన్నికల్లో ప్రజలు తమ అధినేత జగన్ ని గెలిపించి సీఎం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.