జగన్ సిఎం కావాలంటూ నరసరావుపేట ఎంఎల్ఏ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీర్మానం చేసుకున్నట్లున్నారు.

కోరికలు తీరితే తిరుమలకు వచ్చి మొక్కు చెల్లిస్తామని మొక్కుకోవటం సహజం. మరికొందరైతే ముందే ముడుపులు కూడా కట్టేస్తారు. ఓ వైసీపీ ఎంఎల్ఏ కూడా జగన్ కోసం అటువంటి ముడుపే కట్టడం తాజాగా చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావాలంటే మానవ ప్రయత్నంతో పాటు భగవంతుని ఆశీస్సులు కూడా ఉండాలని ఎంఎల్ఏ అనుకున్నట్లున్నారు. అందుకనే జగన్ సిఎం కావాలంటూ నరసరావుపేట ఎంఎల్ఏ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీర్మానం చేసుకున్నట్లున్నారు. ఎటూ జగన్ కూడా స్వామీజీల ఆశీస్సుల కోసం మఠాలకు వెళుతున్న విషయం అందరూ చూస్తున్నదే.

అనుకోవటమే తడవుగా ఎంఎల్ఏ వెంటనే తిరుమల వెంకటేశ్వరునికి మొక్కుకున్నారు. అందుకనే శనివారం నరసరావుపేట నుండి తిరుమలకు కాలినడకన బయలుదేరుతున్నారు. రోజుకు 30 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. జగన్మోహన్ రెడ్డి సిఎం అవ్వటమే తనకు ముఖ్యమన్నారు. అందుకనే తిరుమల వెంకన్నకు మొక్కకున్నట్లు చెప్పారు.