నంద్యాల ఉప ఎన్నికలో చంద్రబాబు కుయుక్తులపై పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం నంద్యాలలో మీడియాతొ మాట్లాడుతూ, పథకం ప్రకారమే నంద్యాలలో అవినీతి డబ్బు  పంపిణీ చేయిస్తున్నట్లు ఆరోపించారు. ఎన్నికల కోసమే అభివృద్ధి హామీలు గుప్పిస్తున్నట్లు ధ్వజమెత్తారు. నంద్యాల అభివృద్ధిపై చంద్రబాబుకు ఎలాంటి చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేసారు. ఉప ఎన్నిక లేకపోతే నంద్యాలలో ఒక్క అభివృద్ధి పని కూడా మొదలుపెట్టేవారే కాదని దుయ్యబట్టారు.

చంద్రబాబు పాలనలో రాయలసీమకు పూర్తిస్థాయిలో అన్యాయం జరుగుతోందని ధ్వజమెత్తారు. వర్షాలు లేక ఒకవైపు పంటలు ఎండిపోతుంటే, రెయిన్‌ గన్లతో  పంటలను కాపాడేసినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకున్న విషయాన్ని గుర్తుచేసారు. పథకాల అమలు పేరుతో ప్రభుత్వ ధనాన్ని ఎలా దోచుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. ఉపఎన్నికల సందర్భంగా చంద్రబాబు పన్నుతున్న కుట్రలను నంద్యాల ప్రజలందరూ గమనించాలంటూ పిలుపునిచ్చారు.