మంగళగిరి మండలం బేతపూడి లో భూసేకరణ ఫైనల్ నోటిఫికేషన్ పై రైతులు సమావేశం జరిగింది. సమావేశంలో మంగళగిరి వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాకుంటోందంటూ రైతులు ఎమ్మెల్యే ముందు ఆవేదన వ్యక్తం చేసారు.

ఆళ్ళ మాట్లాడుతూ,  ప్రభుత్వం జారీ చేసిన తుది నోటిఫికేషన్ చెల్లదని హామీ ఇచ్చారు. భూసేకరణ పై రైతులు అభ్యంతరాలు, కోర్టులో కేసులుండగా ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ను ఎలా విడుదల చేస్తుందంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.

 

 ప్రభుత్వ చర్యను ఎంఎల్ఏ కచ్చితంగా కోర్టు ధిక్కరణగానే భావించారు.

 

తుది నోటిఫికేషన్ను సవాలు చేస్తూ త్వరలో కోర్టులను ఆశ్రయిస్తామంటూ ఆళ్ళ రైతులకు భరోసా ఇచ్చారు.  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రైతులకు అండగా ఉంటుందన్నారు.