జగన్ ను అంటావా, ఒళ్లు దగ్గర పెట్టుకో: పవన్ పై వైసిపి నేతలు ఫైర్

YCP leaders question Pawan Kalyan
Highlights

జగన్‌ గురించి పవన్ కల్యాణ్ గానీ, జనసేన నాయకులు గానీ మాట్లాడడం తగదని రైల్వేకోడూరు వైసీపీ పట్టణ కన్వీనర్‌ సీహెచ్‌రమేష్‌బాబు, నియోజకవర్గ అధికారప్రతినిధి మందలనాగేంద్ర, జిల్లా స్టీరింగ్‌కమిటీసభ్యులు నందాబాల తెలిపారు. 

కడప: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కడప జిల్లా రైల్వే కోడూరు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. జగన్‌ గురించి పవన్ కల్యాణ్ గానీ, జనసేన నాయకులు గానీ మాట్లాడడం తగదని రైల్వేకోడూరు వైసీపీ పట్టణ కన్వీనర్‌ సీహెచ్‌రమేష్‌బాబు, నియోజకవర్గ అధికారప్రతినిధి మందలనాగేంద్ర, జిల్లా స్టీరింగ్‌కమిటీసభ్యులు నందాబాల తెలిపారు. 

జనసేన నాయకుడిది చంచలమైన మనస్తత్వమని వారు శుక్రవారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. అవిశ్వాసతీర్మానం రోజున 150మంది ఎమ్మెల్యేలను తీసుకునివెళ్లి ప్రత్యేక హోదాకోసం ఆమరణదీక్ష చేస్తామని పవన్  చెప్పారని,  ఆ తర్వాత దానిపై అసలు మాట్లాడడంలేదని వారు గుర్తు చేశారు. 

ఇప్పుడే జనంలోకి వచ్చిన పవన్‌కళ్యాణ్‌ కు ఏం తెలుసునని ప్రశ్నించారు. జగన్‌వెంట అన్నికులాలు, మతాలు ఉన్నాయని, చట్టసభలపై వైసీపీకి గౌరవం ఉందని వారన్నారు ఒళ్లుదగ్గరపెట్టుకుని మాట్లాడితే చాలామంచిదని, లేకుంటే భారీగా మూల్యం చెల్లించాల్సివస్తుందని వారు హెచ్చరించారు.

loader