వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నేటి నుంచి శ్రీకాకుళం జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర చేయనున్నారు. కాగా.. ఆయన ఈ రోజు శ్రీకాకుళంలో అడుగుపెట్టే సమయంలో.. వెయ్యి కార్లతో ఆయనకు స్వాగతం పలకనున్నారు. ఈ మేరకు వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి  ఏర్పాట్లు చేశారు. కార్లతో సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

విజయనగరంలో ఈ యాత్రను ముగిం చుకుని ఆదివారం సాయంత్రానికి  శ్రీకాకుళం జిల్లా వీరఘట్టాం మండలం కరకెల్ల గ్రామానికి జగన్ చేరుకోనున్నారు. ఈ జిల్లాలో వచ్చే నెల 3వ తేదీ వరకు జగన్.. పాదయాత్ర కొనసాగునుందని పార్టీ నేతలు తెలిపారు. ఈ పాదాయాత్రలో జగన్ సమక్షంలో ఇతర పార్టీ నేతలను భారీ సంఖ్యలో తమ పార్టీలోకి చేర్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.