పుట్టిన రోజు వేడుకల్లో... యువతుల అశ్లీల నృత్యాలు చేసిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఓ వ్యాపారవేత్త పుట్టిన రోజు వేడుకల్లో ఈ నృత్యాలు వేదికగా మారాయి. పోడూరు మండలం కవిటం గ్రామానికి చెందిన వ్యాపారవేత్త పుట్టిన రోజు వేడుకలు పెనుమట్ర మండలం మార్టేరులోని కోనాల మాణిక్యం కల్యాణ మండపంలో నిర్వహించారు. 

సంబరాల్లో భాగంగా యువతులతో అశ్లీల నృత్యాలు చేయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఐదుగురు యువతులతో పాటు ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేశారు. వేడుకల్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు వైకాపా నేతలు కూడా పాల్గొన్నారు.