వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు ముప్పుందా? అదికూడా ప్రజా సంకల్పయాత్రలోనేనా? అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు ముప్పుందా? అదికూడా ప్రజా సంకల్పయాత్రలోనేనా? అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. పాదయాత్రపై ఓ టివి ఛానల్లో చర్చజరిగింది. ఆ సందర్భంగా వైసీపీ ఎంఎల్ఏ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, పాదయాత్ర సందర్భంగా జగన్ ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేసారు. గడచిన రెండు రోజులుగా జగన్ పాదయాత్రపై చంద్రబాబునాయుడు చేస్తున్న వ్యాఖ్యలు, ఆరోపణలు చూస్తుంటే తమకు ఆందోళన కలుగుతోందన్నారు.
శాంతిభద్రతలను సాకుగా చూపించి జగన్ పాదయాత్రను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేసారు. పాదయాత్రకు రాష్ట్ర పోలీసులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోతే కేంద్ర బలగాల సాయం కోరుతామని సురేష్ చెప్పటం చూస్తుంటే వైసీపీ నేతల్లోని ఆందోళన స్పష్టంగా అర్ధమవుతోంది.
