కడప: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇలాకాలోనే మహిళా ప్రభుత్వోద్యోగికి రక్షణ లేకుండా పోయింది. అధికార వైసిసి నాయకుడు ఓ మహిళా వాలంటీర్ పై చెప్పుతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజవర్గ పరిధిలో చోటుచేసుకోవడం మరింత దారుణం. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పులివెందుల పరిధిలో గౌతమి అనే యువతి గ్రామ వాలంటీర్ గా విధులు నిర్వర్తిస్తోంది. అయితే  పెన్షన్ల పంపిణీ విషయంలో ఆమెకు స్థానిక వైసిపి నాయకుడికి మధ్య వివాదం చోటుచేసుకుంది. 

read more   ఏపీ సచివాలయంలో మరో పదిమందికి కరోనా.... మొత్తం 28కేసులు

పెన్షన్ల పంపిణీలో తాను చెప్పినట్లు పనిచేయడం లేదని వాలంటీర్ గౌతమిని నిలదీశాడు వైసీపీ నేత రఘునాథ్ రెడ్డి. అయితే ఆమె అర్హత  కలిగిన వారికి ఇస్తున్నామని  సమాధానం  చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన అతడు  విచక్షణను కోల్పోయి మహిళ అని కూడా చూడకుండా గౌతమిపై చెప్పుతో దాడి చేశాడు. 

దీంతో రఘునాథ్  రెడ్డి తన పట్ల అమర్యాదగా ప్రవర్తించడమే కాకుండా చెప్పుతో దాడికి పాల్పడినట్లు వాలంటీర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె పిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.