కర్నూల్: కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. కర్నూల్ జిల్లా ఆవుకు  పట్టణంలో 14 ఏళ్ల మైనర్ బాలుడిపై నలుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ నలుగురు యువకుల లైంగిక దాడితో  మైనర్ బాలుడు అస్వస్థతకు గురయ్యాడు.  అస్వస్థతకు గురైన బాలుడిని కుటుంబసభ్యులు నిలదీస్తే అసలు విషయం వెలుగు చూసింది.

Also read:న్యాయం కోసం వచ్చిన యువతిపై అఘాయిత్యం.. ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్

కర్నూల్ జిల్లాలోని ఆవుకు పట్టణంలో ఈ దారుణం చోటుచేసుకొంది. మూడు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకొంది. అయితే బాలుడు అనారోగ్యానికి గురి కావడంతో ఆరా తీసిన కుటుంబసభ్యులకు ఈ విషయం  తెలిసింది.

బాధిత కుటుంబం  పోలీసులను ఆశ్రయించింది. వీరిలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కర్నూల్ జిల్లా ఆవుకు పట్టణంలో ఎన్నికల సమయంలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎన్నికల తర్వాత ఈ కార్యాలయం ఎవరూ ఉపయోగించడం లేదు. అయితే ఈ కార్యాలయంలో బుల్లెట్ రాజు, ప్రేమ్ కుమార్, రాజాతో పాటు మరో వ్యక్తి తరచూ ఇక్కడే గడిపేవారు.

మూడు రోజుల క్రితం ఆవుకు పట్టణానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలుడికి డిన్నర్ ఇస్తామని చెప్పి ఈ కార్యాలయానికి తీసుకొచ్చారు. బాలుడిపై నలుగురు  లైంగిక దాడికి దిగారు. ఈ సమయంలో ఆ బాలుడు తీవ్రంగా బాధకు గురయ్యాడు. ఈ  తతంగాన్ని వారు సెల్‌పోన్‌లో రికార్డు చేశారు.

ఈ లైంగిక దాడితో ఆ బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ విషయమై కుటుంబసభ్యుులు బాలుడిని నిలదీస్తే అసలు విషయం వెలుగు చూసింది.  ఈ విషయమై  బాధితుడు ఇచ్చిన  సమాచారం మేరకు వారి కుటుంబసభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు.

పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  ఈ నలుగురు స్థానికంగా మైనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వీరిపై రౌడీషీట్ కూడ ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు.