జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ అధినేత జగన్ పై పవన్ విమర్శలు మానుకోవాలని సుధాకర్ సూచించారు. శుక్రవారం విజయవాడలోని విలేకరుల సమావేశంలో సుధాకర్ మాట్లాడారు.

పవన్ తన నోటిని జాగ్రత్తగా పెట్టుకోవాలని సుధాకర్ సూచించారు. ప్రజల కోసం పోరాడే జగన్ ని విమర్శించే స్థాయి పవన్ కి లేదన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎదుర్కొనే శక్తి జగన్ కి ఉందని.. ఆయన పారిపోయే రకం కాదని తెలిపారు. 

‘ అభాగ్యులకు అండగా ఉండే జగన్‌పై విమర్శలా?. పవన్‌ నీ సిద్ధాంతం ఏంటి. నీ వేషాలు ఏంటి. ప్యాకేజీ తీసుకుని ఇప్పుడు రోడ్లపైకి వచ్చి ప్రజల చెవిలో పూలు పెడతావా. మీ అన్న చిరంజీవిని అడుగు జగన్‌ గురించి ఏం చెబుతాడో తెలుస్తుంది. మీలాగా ప్రజల్ని మధ్యలో వదిలి పారిపోయే కుటుంబం వైఎస్సార్‌ది కాదు. జగన్‌ను వ్యక్తిగతంగా దూషిస్తూ మళ్లీ మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని దూషిస్తున్నారని అంటావా. నీవు మూడు పెళ్లిళ్లు చేసుకుంది నిజం కాదా. ఒకరితో కాపురం చేస్తూ మరొకరితో పిల్లల్ని కన్నది వాస్తవమా కాదా’ అని ప్రశ్నించారు.