ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు సుభానీ చేతిలో దాడికి గురై సుబ్బారావు గుప్తా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యాడు. తనకు ప్రాణ రక్షణ కల్పించాలని బ్యానర్లు ప్రదర్శించారు.


న్యూఢిల్లీ:తనకు ప్రాణ రక్షణ కల్పించాలలని డిమాండ్ చేస్తూ ycp నేత సోమిశెట్టి Subba Rao గుప్తా గురువారం నాడు ఆకస్మాత్తుగా ఢిల్లీలో తేలాడు.గత ఏడాది సుబ్బారావు గుప్తా మంత్రి Balineni Srinivas Reddy, Kodali Nani తో పాటు పలువురు వైసిపి ఎమ్మెల్యేల పై ఘాటు విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు సుభాని గుంటూరులో లాడ్జీలో ఉన్న సుబ్బారావుపై దాడికి దిగాడు. ఈ వీడియో వైరల్ అయింది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి.రాజకీయంగా ఇబ్బందులు తలెత్తడంతో మంత్రి వాసు సమయస్ఫూర్తి ప్రదర్శించి గుప్తాను బుజ్జగించి సీఎం YS Jaganజన్మదిన వేడుకలను అతని సమక్షంలో చేయించారు. దీంతో వివాదం సమసిపోయిందని అందరూ భావించారు.

 సుబ్బారావు గుప్తా కూడా వాసు తో తనకు విభేదాలు లేవని ప్రకటించారు. తనపై జరిగిన దాడి కేసు కేసులో చట్టప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటారని ఆ రోజున చెప్పారు. కానీ గురువారం Delhi లోని జంతర్ మంతర్ వద్ద సుబ్బారావు గుప్తా ఒక బ్యానర్ తో నిలబడి ఆ ఫోటోలను మీడియా కు పంపారు.కేంద్ర హోం మంత్రిAmit Shah నే తనకు ప్రాణ రక్షణ కల్పించాలని తన కుటుంబాన్ని కాపాడాలని, తనపై దాడి చేసిన వారిని శిక్షించాలని సుబ్బారావు కోరారు. ఈ మేరకు ఆ బ్యాసర్ లో కోరారు.

 మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబుల వ్యాఖ్యలతో వైసీపీ నష్టమని సుబ్బారావు గుప్తా గత ఏడాది డిసెంబర్ మాసంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆయన కన్పించకుండా పోయాడు. వైసీపీ నేతలు తమను వెతుకుతున్నారని భావించి గుంటూరులో తలదాచుకొన్నాడు. లాడ్జీలో ఉన్న సుబ్బారావును మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు సుభానీ కొట్టాడు. క్షమాపణలు కూడా చెప్పించాడు.ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సుభానీని గత ఏడాది డిసెంబర్ 22న పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

 సుభాని ఓవరాక్షన్ వలనే ఈ రచ్చకు కారణమని సుబ్బారావు గతంలో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ప్రకటించారు. చెప్పారు. తాను మొదటి నుండి రాజకీయాలలో మంత్రి బాలినేని వెంట వున్నానని గుర్తు చేసుకొన్నారు. తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఉన్న పరిస్థితులను బట్టి చేశానన్నారు. ఈ వ్యాఖ్యల వెనుక ఎవరూ లేరన్నారు. పార్టీని బతికించుకోవాలనే ఆకాంక్షతో ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తనపై దాడి చేయించారనే వార్తలను సుబ్బారావు గుప్తా ఖండించారు.