‘కులాల మధ్య చిచ్చుపెడుతున్న మంత్రి సునీత’

ycp leader sensational comments on minister paritala sunitha
Highlights

మంత్రి పరిటాల సునీతపై  వైసీపీ నేతల ఆరోపణ

మంత్రి పరిటాల సునీత గ్రామాలలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల రెడ్డి, రాప్తాడు రాప్తాడు నియోజకవర్గ ఇన్ చార్జీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు.

మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన వీరు.. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అధికార పార్టీ నేతలు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గ్రామాలు ప్రశాంతంగా ఉండడం టీడీపీ నేతలకు ఇష్టం లేదన్నారు. పోలేపల్లిలో కనకదాస విగ్రహం ఏర్పాటు చేయాలని కురుబ కులస్తులు ఏడాదికిందటే సిద్ధం చేసుకున్నారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. అయితే విగ్రహం ఏర్పాటు చేయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. 

దీంతో గ్రామంలో కురుబ కులస్తులు  అధికార పార్టీకి వ్యతిరేకంగా మారారని.. ఇది గమనించి వారికి తాయిలాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారి గడ్డివాము కల్లాలు తొలగించి ఆ స్థలాలను  బీసీలకు ఇళ్ల స్థలాలుగా ఇస్తామంటూ ప్రకటించారన్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామని అయితే రెడ్డి – కురుబ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుండటాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.  కులాల మధ్య చిచ్చు పెట్టి శాంతిభద్రతల సమస్య తలెత్తేందుకు కారణమవుతున్నారంటూ వారు ఆరోపించారు.

loader