తామే చాంపియన్ అనిపించుకోవాలనే టీడీపీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని దుయ్యబట్టారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారని మేకపాటి ధ్వజమెత్తారు. 

ఒకప్పుడు అవిశ్వాసం పెడతామని తామంటే ఎగతాళి చేసిన చంద్రబాబే.. ఇప్పుడు అవిశ్వాసం పెట్టారని వైసీపీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోపించారు. అవిశ్వాసంపై చంద్రబాబుకి అసలు చిత్తశుద్ది లేదని ఆయన అన్నారు.

పార్లమెంట్ లో టీడీపీ అవిశ్వాసం పెట్టడంపై మేకపాటి గురువారం స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. తామే చాంపియన్ అనిపించుకోవాలనే టీడీపీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని దుయ్యబట్టారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారని మేకపాటి ధ్వజమెత్తారు. బీజేపీ, టీడీపీలు కలిసి లాలుచీ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

‘టీడీపీ సొంత ప్రయోజనాలను నెరవేర్చుకోవాలనే తపన తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. ఎగతాళి చేసిన చంద్రబాబే అవిశ్వాసం పెట్టారు. విభజన హామీలు నెరవేర్చాలని మొదటి నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కోరుతోంది. రాష్ట్ర సమస్యలను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరిష్కారం చూపుతారు. వైఎస్ జగన్‌ వస్తేనే ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది’ అని మేకపాటి అన్నారు.