ఆంధ్రప్రదేశ్‌లో ఉద్రిక్తత పరిస్థితులు  కొనసాగుతునే ఉన్నాయి. అధికార పార్టీ వైకాపా ప్రతిపక్ష పార్టీ తేదేపా చెందిన  నాయకుల  మధ్య  ఘర్ణణలు రోజురోజుకు 
తీవ్రమవుతునే ఉన్నాయి.  తాజాగా  అనంతపురం జిల్లాలోని వెంకటాపురంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు.  తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు  ఇంటి చుట్టూ రాళ్లను పాతిపెట్టి  భయబ్రాంతులకు  గురిచేశారు.

బుక్కరాయ సముద్ర మండలం వెంకటాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటి చూట్టూ రాళ్లను పాతి పెట్టడడంతో సదురు  నేత కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Also Read: నేతల వలసల ఎఫెక్ట్: జిల్లాల్లో చంద్రబాబు టూర్

దీంతో ఆ టీడీపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని కంప్లెట్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో ఉన్నతాధికారులు ఘటనాస్థలి చేరుకుని పరిశీలించారు.

 ఈ విషయంపై జిల్లా టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వివరాలు తెలుసుకున్న రాష్ట్ర టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఆందోళనకు సిద్దమయ్యారు. దీంతో జిల్లాలో ఎలాంటి ఉద్రికత్త పరిస్ధితులు జరగకుండా ఉండేందుకు ఆయన్ను బుక్కరాయసముద్రం దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుండి  పీఎస్‌కి తరలించారు. 

అనర్హత భయంతోనే... జగన్‌పై అభిమానంతో కాదు: వంశీ చేరికపై యార్లగడ్డ నిప్పులు
ఈ ఘటన తీవ్ర వివాదంగా మారుతుండడంతో వైసీపీ నేత, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డి రంగంలోకి దిగారు. వైసీపీ నాయకులు, ఎంపీడీవోతో చర్చలు జరిపారు. ఈ వివాదాన్ని వారంలో పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
 

అయితే ఈ విషయం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదురు టీడీపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేసేవరకు ఎవరు కూడా బాధితుడికి అండగా నిలవడానికి  సాహసించలేదని తెలుస్తోంది. టీడీపీ నేత ఇంటి చుట్టూ ఎందుకిలా రాళ్లు నాటారు దానిపై పోలీసులు  విచారణ జరుపుతున్నారు.  ఈ వ్యవహారం వెనుకున్న నేత ఎవరు..? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.