విజయవాడ:టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఈ నెల 29వ తేదీ నుండి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయా జిల్లాల్లో  పార్టీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.

ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాల వారీగా టీడీపీ నేతల సమీక్ష సమావేశాలను నిర్వహించనున్నారు.ఎన్నికల ఫలితాల తర్వాత  రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే కొందరు నేతలు బీజేపీ, వైసీపీ వైపు చూస్తున్నారు. ఈ తరుణంలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు జిల్లాల పర్యటనలు చేపడుతున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పర్యటించారు.

ఈ నెల 29వ తేదీ నుండి టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కృష్ణా జిల్లా పర్యటనకు బయలుదేరనున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో చంద్రబాబునాయుడు కృష్ణా జిల్లా పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకొంది.

ఈ నెల 29వ తేదీన కృష్ణా జిల్లా టూర్‌ పూర్తికానుంది.ఈ నెల 29 నుండి జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. ఈ ఏడాది డిసెంబర్ 24వ తేదీతో జిల్లాల పర్యటనలు పూర్తి కానున్నాయి.కృష్ణా జిల్లా పర్యటన తర్వాత చిత్తూరు, అనంతపురం, పశ్చిమగోదావరి, కడప, ప్రకాశం, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు.

ఈ నెల 29వ తేదీన కృష్ణా జిల్లాలో చంద్రబాబునాయుడు పర్యటిస్తారు. మూడు రోజుల పాటు కృష్ణా జిల్లాలో చంద్రబాబునాయుడు పార్టీ సమీక్ష సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ నెల 29,30, 31 తేదీల్లో కృష్ణా జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు.

కృష్ణా జిల్లా పర్యటన తర్వాత నవంబర్ 6,7,8 తేదీల్లో చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. నవంబర్ 13,14, 15 తేదీల్లో చంద్రబాబునాయుడు పర్యటిస్తారు.

నవంబర్ 13,14,15 తేదీల్లో అనంతపురం జిల్లాలో చంద్రబాబునాయుడు పర్యటిస్తారు. అనంతపురం జిల్లా నుండి చంద్రబాబునాయుడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. నవంబర్18,19,20 చంద్రబాబు పర్యటించనున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా నుండి చంద్రబాబునాయుడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ఏడాది నవంబర్ 25,26 తేదీల్లో  కడపలో చంద్రబాబు పర్యటించనున్నారు.ఈ ఏడాది డిసెంబర్ 2,3,4 తేదీల్లో కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నట్టు టీడీపీ వర్గాలు తెలిపారు.

డిసెంబర్ 10,11,12 తేదీల్లో ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. డిసెంబర్ 17,18,19 తేదీల్లో గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. డిసెంబర్ 23,24 తేదీల్లో విజయనగరం జిల్లాలో చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు.

వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు నేతల వలసల కారణంగా కొత్త నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవడం వంటి అంశాలపై చంద్రబాబునాయుడు కేంద్రీకరించనున్నారు.