Asianet News TeluguAsianet News Telugu

‘చంద్రబాబుకి బుర్ర సరిగా పనిచేయడం లేదు’

అందుకు ఇవే సాక్ష్యాలు అంటున్న అంబటి

ycp leader ambati rayudu slashes ap cm chandrababu naidu

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు.  చంద్రబాబుకి బుర్ర సరిగా పనిచేయడం లేదనే అనుమానం కలుగుతోందన్నారు. అబ్దుల్‌ కలాంను రాష్ట్రపతిగా, సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా, హైదరాబాద్‌ను తాను నిర్మించానని, భారత్‌కు సెల్‌ఫోన్‌ను తెచ్చానని చంద్రబాబు చెప్పుకోవడమే ఈ అనుమానం కలిగిస్తోందని చెప్పారు. తిరుపతి బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు అల్టిమేటం జారీ చేస్తారని ప్రజలు ఆశించారన్నారు. అయితే, అందుకు భిన్నంగా చంద్రబాబు టీడీపీ బ్రిటీష్‌పై పోరాటం చేసిందనడంతో ప్రజలందరూ నవ్వుకున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో అయితే.. విపరీతంగా జోక్స్ వేసుకొని మరీ నవ్వుకుంటున్నారని వివరించారు.

‘మహాత్మాగాంధీ వెంట గనుక చంద్రబాబు తిరిగినట్లుయితే స్వతం‍త్రం కోసం ఇంగ్లండ్‌ వెళ్లి పోరాటం చేయాలని చెప్పేవారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై ఆంధ్రలో పోరాటం చేయకూడదని చంద్రబాబు అంటున్నారు. మరి ధర్మపోరాట దీక్షలను ఢిల్లీలో చేయొచ్చుగా?  ఆంధ్రప్రదేశ్‌లో మూడు సెంటీమీటర్ల వర్షపాతం కురిస్తే సెక్రటరియేట్‌లోని ప్రతిపక్ష నేత చాంబర్‌లో ఆరు సెంటీమీటర్ల వర్షం పడింది. చంద్రబాబు అనేక దోపిడీలకు, అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడ్డారు. ఆయన చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం తప్ప మరో పరిష్కారం లేదు.

ఇక ప్రజలను మోసం చేయనని, ప్రత్యేక హోదా గురించి నిజంగా పోరాడతానని చంద్రబాబు ప్రజలతో చెప్పాలి. ఆ తర్వాత ప్రత్యేక హోదా గురించి మాట్లడాలి. అప్పటివరకూ ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు. టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించండి. అలా చేయకుండా కాకమ్మ కబుర్లు చెప్పకండి. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక రాష్టంలోని 13 జిల్లాలను 25 జిల్లాలుగా మార్చబోతున్నాం. కృష్ణా జిల్లా కృష్ణాగానే ఉంటుంది. రెండు భాగం అయ్యే జిల్లాకు నందమూరి తారక రామారావు జిల్లాగా నామకరణం చేస్తాం.

వచ్చే ఎన్నికల్లో తననే గెలిపించాలని చంద్రబాబు చెబుతున్నారు. 2014లో గెలిపిస్తే ఈ ఐదేళ్లలో ఏం చేశాడు. వచ్చే ఐదేళ్లలో మళ్లీ అధికారం ఇస్తే ఏం చేస్తాడు. ఒక్క అవకాశాన్ని వైసీపీకి ఇవ్వండి. 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌ సీపీని గెలిపించండి. కచ్చితంగా మార్పు తెచ్చి చూపిస్తాం.’ అని అంబటి రాష్ట్ర ప్రజలను కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios