‘వంచన’ పై వైసీపీ గర్జన

ycp hunger strike on nellore
Highlights

మోసపూరిత వైఖరిని నిరిసిస్తూ ఈ దీక్ష చేపట్టారు.

ఏపీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ.. వైసీపీ ఆధ్వర్యంలో నెల్లూరులో  ‘వంచన పై గర్జన’ కార్యక్రమాన్ని చేపట్టారు. నవనిర్మాణ దీక్షల పేరుతో రాష్ట్ర ప్రజలను వంచిస్తున్న చంద్రబాబు మోసపూరిత వైఖరిని నిరిసిస్తూ ఈ దీక్ష చేపట్టినట్లు వైసీపీ నేతలు తెలిపారు. 

ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలను సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘోర వైఫల్యం చెందారని ఈ సందర్భంగా వైసీపీ నేతలు ఆరోపించారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైందన్నారు.
 
నెల్లూరులోని వీఆర్‌ కళాశాల మైదానంలో ఉదయం నుంచి సాయంత్ర 5 గంటల వరకు ‘వంచనపై గర్జన’ నిరాహార దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షలో పదవులకు రాజీనామాలు చేసిన ఐదుగురు వైఎస్సార్‌ సీపీ లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ ప్రాంతీయ కోఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. నల్లదుస్తులు ధరించి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ.. నేతలు దీక్షలో కూర్చున్నారు.

loader