టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఇంటి గోడను అధికారులు కూల్చివేయడంపై ఆయన స్పందించారు. బీసీలను అణిచివేయడమే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించారు. వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. 

రాష్ట్రంలోని బీసీలను అణచివేయడమే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పని చేస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. బీసీల‌పై జగన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంద‌ని అన్నారు. ఈ మేర‌కు ఆదివారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడ‌ద‌ల చేశారు. వైసీపీ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. 

Agnipath: త‌మిళ‌నాడును తాకిన నిర‌స‌న‌లు.. అగ్నిప‌థ్ ను వెన‌క్కి తీసుకోవాలన్న స్టాలిన్‌

రెండు రోజుల క్రితం జరిగిన మహానాడులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారి ఇంటి గోడ‌లు కూల్చడం సిగ్గుచేటని అన్నారు. ఆ ఇళ్ల‌ను అక్ర‌మ క‌ట్ట‌డం అంటూ పోలీసులు, ఇత‌ర అధికారులు చెప్ప‌డం సిగ్గుచేట‌ని తెలిపారు. అక్రమ కట్టడం అయితే ముందుగానే నోటీసులు ఇవ్వాల‌ని చెప్పారు. కానీ గోడ‌లు కూల్చేసిన తర్వాత ముసుగు వేసుకుని ఒక వ్యక్తిని పంపించి, ఇంటి లోప‌ల నోటీసు ప‌త్రాల‌ను విసిరి వెళ్లార‌ని ఆరోపించారు. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచన తాడేపల్లిలోని తుగ్లక్ కు మాత్రమే వస్తాయని మ‌రోసారి నిరూపిత‌మైంద‌ని తీవ్రంగా దుయ్య‌బ‌ట్టారు. 

రైడ్స్ లో పోలీసులు సెక్స్ వర్కర్లను అరెస్టు చేయవద్దు - మ‌ద్రాస్ హైకోర్టు

అక్రమ కట్టడమైతే తెల్లవారు జామున 4 గంటలకు ఆర్డీవో, ఎస్పీ సహా వందలాది మందితో రావాల్సిన అవసరం ఏమిటని య‌న‌మ‌ల రామకృష్ణుడు ప్ర‌శ్నించారు. జగన్ రెడ్డి పాలనలో మగ్గిపోతున్న ఆంధ్రప్రదేశ్ కు స్వాతంత్రం కోసం మరో ఉద్య‌మం చేయాల్సిన ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌పై పోరాడుతూ బీసీల ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడుకోవాల‌ని య‌న‌మ‌ల పిలుపునిచ్చారు. 

భారత్-పాక్ సమస్యలకు అమెరికా పాక్‌కు ఇచ్చిన మద్దతే దోహదపడింది: కేంద్ర మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు

కాగా ఇదే విష‌యంపై టీడీపీ నేత బొండా ఉమా ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు. ప్రజావేదిక కూల్చివేతతోనే సీఎం జగన్ పాలన మొదలైందని అన్నారు. సీఎం జగన్ ఇంటి పునాదులు కదలడంతోనే.. టీడీపీ నేతల ఇళ్లు కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. ‘‘జగన్ ఇవాళ మీది.. రేపు మాది’’ అని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనతో ప్రభుత్వం ఉలిక్కిపడిందన్నారు. చంద్రబాబు పర్యటనకు వచ్చిన జనాన్ని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని.. అందుకే టీడీపీ నేతల ఇంటి గోడలు కూల్చివేస్తున్నారని ఆరోపించారు. తాడేపల్లి ఆదేశాలను అధికారులు పాటిస్తున్నారని.. అధికారం ఉందని కొందరు రెచ్చిపోతున్నారని విమర్శించారు. వెల్లంపల్లి అవినీతిని ప్రశ్నిస్తే ఓ సామాన్యుడిని అరెస్ట్ చేయిస్తారా అని ప్రశ్నించారు. అయ్యన్నను అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ వేధింపులకు భయపడేది లేదని చెప్పారు.