చంద్రబాబు చెప్పినట్టుగా  వింటున్నందునే  తాము పవన్ కళ్యాణ్  ను  దత్త పుత్రుడు అని అంటున్నామని వైసీపీ నేతలు  ప్రకటించారు.

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ల సమావేశంపై వైసీపీ తీవ్రంగా మండిపడింది. గంగిరెద్దులు సంక్రాంతికి ఇంటింటికి తిరుగుతాయన్నారు. అలాగే చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లాడని అంబటి రాంబాబు విమర్శించారు. డుడు బసవన్నలా తల ఊపడానికే చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యాడన్నారు. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…

సంక్రాంతి మామూళ్ల కోసమే దత్తతండ్రి దగ్గరికి దత్తపుత్రుడు వెళ్లాడని ఏపీ మంత్రి అమర్నాద్ వ్యాఖ్యానించారు. ట్విట్టచ్ వేదికగా అమర్నాద్ ఈ విమర్శలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్కటేనని తాము ఎప్పటి నుండే చెబుతున్నామని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గుర్తు చేశారు. రాష్ట్రం కంటే వీళ్ల ప్రయోజనాలే ఈ ఇద్దరికి ముఖ్యమని నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్యాన్ని దోచుకోవడం, దాచుకోవడం కోసమే ఈ ఇద్దరి నేతల ప్రయత్నమని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. 

also read:అనంతపురంలో పవన్ ను గెలిపిస్తా: మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు

2014లో కూటమిగా పోటీ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీలు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా మార్చాయని వైసీపీ ఎమ్మెల్యే మల్ది విష్ణు ఆరోపించారు. చంద్రబాబు చెప్పినట్టుగా చేస్తున్నాడనే పవన్ కళ్యాణ్ ను దత్తపుత్రుడు అంటున్నామన్నారు. ఈ భేటీతో వీరిద్దరి ముసుగు తొలగిపోయిందని ఆయన చెప్పారు.