అనంతపురంలో పవన్ ను గెలిపిస్తా: మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు


అనంతపురంలో  పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే  ఆయన గెలుపును తన భుజాలపై వేసుకొని పనిచేస్తానని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ప్రకటించారు. 

Anantapur former mla prabhakar chowdary  ubteresting comments on  Pawan kalyan, chandrababu meeting

అనంతపురం: జనసేన అధినేత  పవన్ కళ్యాణ్  అనంతపురం నుండి పోటీ చేస్తే దగ్గరుండి ఆయనను గెలిపిస్తానని మాజీ ఎమ్మెల్యే  ప్రభాకర్ చౌదరి  చెప్పారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబునాయుడు భేటీపై  ఆదివారం నాడు  అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు.   వైసీపీ   ఓటమి, జగన్ ఇంటికి పోవడమే రెండు పార్టీల లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. జనసేన తమకి గతంలో  పొత్తులో  ఉన్న పార్టీ.గా ఆయన గుర్తు చేశారు. ఎన్నికలకు తన వ్యూహం వేరే ఉందని  పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

2014 ఎన్నికల్లో  టీడీపీ, బీజేపీ కూటమికి జనసేన మద్దతును ప్రకటించింి.  2014 ఎన్నికలకు ముందే  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  జనసేన పార్టీని ప్రకటించారు.  ఈ ఎన్నికల్లో  టీడీపీ, బీజేపీలు  ఏపీ, తెలంగాణలో కలిసి పోటీ చేశాయి. ఈ రెండు  పార్టీల  కూటమి అభ్యర్ధులకు మద్దతుగా  పవన్ కళ్యాణ్  ప్రచారం నిర్వహించారు. 2014 ఎన్నికల్లో  ఏపీలో  టీడీపీ అధికారంలోకి వచ్చింది.  ఆ తర్వాత  చోటు  చేసుకున్న పరిణామాల్లో  జనసేన టీడీపీకి దూరమైంది.  2019  ఎన్నికలకు  ఏడాది ముందు  ఎన్డీఏ నుండి  టీడీపీ బయటకు వచ్చింది.  2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు ఒంటరగా పోటీ చేశాయి.  లెఫ్ట్ పాలర్టీలతో కలిసి  పవన్ కళ్యాణ్ పోటీ చేశారు.  వైసీపీ  ఒంటరిగా  బరిలో దిగింది.  ఈ ఎన్నికల్లో  వైసీపీ ఘన విసయం సాధించింది.  టీడీపీ  23 అసెంబ్లీ స్థానాలకే  పరిమితమైంది.  2019 ఎన్నికల తర్వాత  రాజకీయ  పరిణామాలతో  పవన్ కళ్యాణ్ లెఫ్ట్ పార్టీలకు గుడ్ బై చెప్పారు. బీజేపీతో  పొత్తు పెట్టుకున్నారు.  2019 ఎణ్నికల్లో కలిసి పోటీ చేస్తామని ఈ రెండు పార్టీల నేతలు ప్రకటించారు. కానీ  బీజేపీ, జనసేనలు  మిత్రపక్షంగా  ఉన్నప్పటికీ  కూడా  ఈ రెండు పార్టీల మధ్య  అంతరం కొనసాగుతుంది.  బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు తీరు కారణంగానే  జనసేన ...దూరంగా జరుగుతుందనే  అభిప్రాయాన్ని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. 

వచ్చే ఎన్నికల్లో  175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంగా  వైసీపీ వ్యూహలతో ముందుకు  వెళ్తుంది. అయితే  వచ్చే ఎన్నికల్లో జగన్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని  పవన్ కళ్యాణ్  ప్రకటించారు. 175 స్థానాల్లో వైసీపీ గెలుస్తుంటే  చూస్తూ  ఊరు కొంటామా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. 

also read:ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం:చంద్రబాబుతో పవన్ భేటీ

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించేందుకు  పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని  వైసీపీ నేతలు  పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ విమర్శలకు పవన్ కళ్యాణ్ కూడా అదే స్థాయిలో  స్పందిస్తున్నారు.  ఈ క్రమంలోనే  రెండు పార్టీల నేతలు  వ్యక్తిగత  విమర్శలకు కూడ దిగిన విషయం తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios