వైసీపిలో బెజవాడ మేయర్ చిచ్చు: అజ్ఞాతంలోకి పుణ్యశీల
విజయవాడ వైసీపీలో మేయర్ పదవి చిచ్చు పెట్టింది. సీనియర్ మహిళా కార్పోరేటర్ పుణ్యశీల అలక వహించారు. తనకు మేయర్ పదవి దక్కకపోవడంతో పుణ్యశీల తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో మేయర్ పదవి చిచ్చు పెట్టింది. మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్న కార్పోరేటర్ పుణ్యశీల తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గతంలో ఐదేళ్ల పాటు ఆమె వైసీపీ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు.
మేయర్ పదవి పుణ్యశీలకే దక్కుతుందంటూ పార్టీలో విస్తృతంగా ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చడంతో ఆమె తీవ్ర అసహనానికి గురైనట్లు చెబుతున్నారు. గెలిచిన కార్పోరేటర్లతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశానికి పుణ్యశీల డుమ్మా కొట్టారు.
వైసీపిలో కార్పోరేటర్ గా గెలిచిన ఏకైక సీనియర్ మహిళా కార్పోరేటర్ గా పుణ్యశీలకు గుర్తింపు ఉది. కావాలనే మంత్రి వెల్లంపల్లి మేయర్ పదవి విషయంలో పావులు కదిపారని పుణ్యశీల వర్గం ఆరోపిస్తోంది.
కార్పోరేటర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి పుణ్యశీల హాజరవుతారా, లేదా అనేది కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. పార్టీ నేతలకు ఎవరికీ ఆమె అందుబాటులో లేరు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి అదేశాల మేరకు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ మేయరుగా రాయన భాగ్యలక్ష్మి పేరును సహచార కార్పొరేటర్ అభ్యర్థులు ప్రతిపాదించిన్నట్లు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నిక అయిన వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులతో మంత్రి సమావేశం నిర్వహించారు.
సమావేశంలో విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ మేయరుగా రాయన భాగ్యలక్ష్మి సీఎం జగన న్న ఎంపిక చేసిన్నట్లు వివరించారు.. బీసీలకు పెద్ద పీఠ వేస్తూ సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 46వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి కి మంత్రి వెలంపల్లి అభినందనలు తెలిపారు.