కందుకూరు, గుంటూరు తొక్కిసలాటకు వైసీపీ కుట్ర: పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాత చంద్రబాబు
కందుకూరు, గుంటూరు తొక్కిసలాట వెనుక వైసీపీ కుట్ర ఉందని టీడీపీ చీఫ్ చంద్రబబు నాయుడు ఆరోపించారు. ఈ కుట్రకు పోలీసులు సహకరించారన్నారు.
హైదరాబాద్:కందుకూరు, గుంటూరులలో జరిగిన తొక్కిసలాట వైసీపీ కుట్రేనని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఈ కుట్రను పోలీసులు అమలు చేశారన్నారు. ఆదివారంనాడు పవన్ కళ్యాణ్ తో భేటీ ముగిసిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
జనసేన సమావేశానికి ఇప్పటం గ్రామస్తులు స్థలం ఇస్తే ఆ గ్రామంలో ఇళ్లను కూల్చివేశారన్నారు. పవన్ కళ్యాణ్ ను విశాఖలో, ఇప్పటంలో పర్యటించే సమయంలో పోలీసులు ఆంక్షలు విధించారన్నారు. తనకు కూడా కుప్పంలో అడుగడుగునా ఆటంకాలు కల్పించారని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తాను గతంలో ఆత్మకూరు పర్యటనకు వెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. విశాఖపట్టణం వెళ్తే కూడా గతంలో అడ్డుకున్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. విశాఖలో వైసీపీ గూండాలతో గొడవ చేయించారన్నారు. శాంతి భద్రతల సమస్యల తలెత్తుందని చెప్పి తనను పోలీసులు వేరే విమానంలో పంపించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తాను చిత్తూరు పర్యటనకు వెళ్తే తనను తిరుపతి ఎయిర్ పోర్టు నుండే వెనక్కి పంపారని చంద్రబాబు చెప్పారు. రాజధాని ఏరియాలో రైతులకు తాను మద్దతు తెలిపేందుకు వెళ్తున్న సమయంలో తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారన్నారు. ప్రజా స్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని ఆనాడు ఉన్న డీజీపీ వ్యాఖ్యలు చేశారని చంద్రబబు మండిపడ్డారు.
ప్రజాస్వామ్యంలో జరగరానివి జరుగుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న కుప్పంలో జరిగిన ఘటన పరాకాష్టగా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ప్రతి పార్టీకి నిర్ధిష్టమైన ఆలోచనలు, ప్రణాళికలుంటాయన్నారు. కానీ వైసీపీకి మాత్రం నేరాలు, అవినీతి చేయడం, నేరాలు చేయడం, వ్యవస్థలను భ్రష్టు పట్టించమే తెలుసునని చంద్రబాబు విమర్శించారు. ప్రజల పక్షాన ఎవరైనా పోరాటం చేస్తే వారిపై వైసీపీ దాడులు చేస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో నెంబర్ 1కి చట్టబద్దత ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఈ జీవోను తెచ్చి ఉన్మాదులా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. కుప్పంలో తాను ఏడుసార్లు విజయం సాధించినట్టుగా చెప్పారు. ఉమ్మడి ఏపీ నుండి అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన విషయాన్ని చంద్రబాబు చెప్పారు. తాను నియోజకవర్గానికి వెళ్లినా వెళ్లకపోయినా ప్రజలు తనను గెలిపిస్తున్నారన్నారు. మూడు మాసాల క్రితం తాను వెళ్లిన సమయంలో కూడా తమ మీటింగ్ కు వైసీపీ మనుషులను పంపి తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేయించారని చంద్రబాబు చెప్పారు. తమపై దాడి చేసి తమ మీదనే కేసులు బనాయించారని చంద్రబాబు తెలిపారు.కుప్పంలో జరిగిన ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు. మహిళలు పోలీసులపై హత్యాయత్నం చేసినట్టుగా కేసులు పెట్టారన్నారు.
also read:రాష్ట్రంలో అరాచక పాలన: చంద్రబాబుతో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్
ఏపీ సీఎం జగన్ మాత్రం సభలు పెట్టుకోవచ్చు కానీ, ఇతర పార్టీల నేతలు సభలు పెట్టుకోవద్దా అని చంద్రబాబు ప్రశ్నించారు. కందుకూరు, గుంటూరులలో సభలలో తొక్కిసలాటను సాకుగా ప్రభుత్వం చూపుతుందన్నారు. కందుకూరు, గుంటూరులలో తొక్కిసలాట జరగకుండా అడ్డుకోవడంలో పోలీసులు వైఫల్యం చెందారన్నారు. పవన్ కళ్యాణ్, తాను ఎక్కడికి వెళ్లినా ప్రజలు విపరీతంగా జనం వస్తున్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.
కావలి, కోవూరులలో జరిగిన సభల్లో ఎలాంటి ఘటనలు జరగని విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ సభల్లో పోలీసులు ఎకువగా ఉన్నారన్నారు..ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటైందన్నారు. జనసేన, టీడీపీ, ప్రజా సంఘాలు ఈ వేదికలో భాగస్వామ్యమైనట్టుగా చంద్రబాబు చెప్పారు. కలిసికట్టుగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకుంటామని చంద్రబాబు ప్రకటించారు.