విజయవాడ వైసీపీ నేత గౌతమ్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. దివంగత కాపు నేత వంగవీటి రాధా, మాజీ ఎంఎల్ఏ మల్లాది విష్ణుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గౌతమ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేస్తూ ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు వైసీపీ లో కొన్ని నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

విజయవాడ వైసీపీ నేత గౌతమ్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. దివంగత కాపు నేత వంగవీటి రంగా, మాజీ ఎంఎల్ఏ మల్లాది విష్ణుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గౌతమ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేస్తూ ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు వైసీపీ లో కొన్ని నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాధా, మల్లాదిలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రాధా భార్య రత్నకుమారి, కుమారుడు రాధాకృష్ణతో పాటు రాధా మద్దతుదారులు గౌతమ్ ఇంటిపై దాడి చేసారు. ఇరువర్గాల మధ్యా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

మధ్యాహ్నం నుండే రాధా అభిమానులకు, గౌతమ్ మద్దతుదారులకు మధ్య అక్కడక్కడ విజయవాడలో ఘర్షణ వాతావారణం చోటు చేసుకోవటంతో పార్టీ నేతలు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే, గౌతమ్ అయినా రాధాకృష్ణ అయినా ఇద్దరూ వైసీపీలోనే ఉన్నారు. దాంతో ఘర్షణ మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఏర్పడింది. దాంతో జిల్లా పార్టీ అధ్యక్షుడ పార్ధాసారధి గౌతమ్ కు ఉదయం షోకాజ్ నోటీసు జారీ చేసారు. అయితే సాయంత్రానికి పరిస్ధితి చేయిదాటిపోయే పరిస్ధితులు ఎదురవ్వటంతో వెంటనే గౌతమ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసారు.