పట్టపగలే పరిటాల రవిని కాల్చి చంపారు: జగన్ పై యనమల

Yanamala retaliates YS Jagan
Highlights

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రంగా మండిపడ్డారు.

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రంగా మండిపడ్డారు. జగన్ లాంటి రాక్షసుడు మరొకరు లేరని, జగన్ కు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అడ్డంగా భక్షిస్తారని ఆయన అన్నారు.

జగన్ కు అధికారం ఇస్తే బిజెపికి తాకట్టు పెడుతారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కేవలం ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయలు భక్షించిన జగన్ కన్నా మించిన రాక్షసుడు ఎవరుంటారని ఆయన అన్నారు. 

తన కేసులను మాఫీ చేయించుకోవాడనకిి జగన్ ప్రధాని మోడీ చుట్టూ తిరుగుతున్ారని, బిజెపి చెప్పిందే చెస్తున్నారని అన్నారు. జగన్ లాంటి రాక్షసుడు వస్తే వచ్చేది రాక్షస రాజ్యమేనని అన్నారు. బిజెపితో లాలూచీ పజి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

కర్ణాటకలో ఖనిజ దొంగ గాలి గ్యాంగ్ కు వైసిపి ప్రచారం చేయలేదా అని అడిగారు. రాక్షస మూకలన్నీ ఏకమవుతున్నాయని, మాఫియాలన్నీ ఏకమవుతున్నాయని అన్నారు. ప్రజా ధనాన్ని దోచుకోవడనికి మళ్లి ఒక్కటవుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు . 

పట్టపగలే పరిటాల రవిని కాల్చి చంపారని ఆయన అన్నారు. జగన్ కన్నా బ్రహ్మరాక్షసుడు మరొకరు లేరని అన్నారు. చంద్రబాబు రాక్షసుడు అనడమే జగన్ రాక్షసత్వానికి పరాకాష్ట అని అన్నారు. దాదాపు 220 మంది టీడీపి కార్యకర్తలను హత్య చేశారని ఆరోపించారు.

జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని మరో మంత్రి దేవిని ఉమామహేశ్వర రావు అన్నారు. జగన్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని, జగన్ ఒక్క వినతనైనా స్వీకరించారా అని అన్నారు.

loader