Asianet News TeluguAsianet News Telugu

రికార్డ్ బ్రేక్... చంద్రబాబు ఐదేళ్లలో చేసింది జగన్ కేవలం రెండేళ్లలోనే..: యనమల సంచలనం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిధుల ఖర్చులో ఎందుకు పారదర్శకత పాటించలేదు... అసెంబ్లీకి, కాగ్, కేంద్ర ఆర్థిక సంస్థలకు తెలియకుండా ఎందుకు దాచారు? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

yanamala ramakrishnudu sensational comments on on financial position  akp
Author
Amaravati, First Published Aug 5, 2021, 4:05 PM IST

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నిధులకు మంత్రివర్గం ట్రస్టీలే గాని యజమానులు కాదని మాజీ ఆర్థిక మంత్రి యజమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ప్రభుత్వ నిధులన్నీ ప్రజాధనమే...ఈ ప్రజాధనాన్ని ఖర్చు చేయడానికి నిబంధనలు ఉంటాయన్నారు. వైసిపి ప్రభుత్వం ప్రజల కోసమే నిధులు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా... రాజ్యాంగ ఉల్లంఘనలకు ఎందుకు పాల్పడినట్లు? అని ప్రశ్నించారు. 

నిధుల ఖర్చులో ఎందుకు పారదర్శకత పాటించలేదు... అసెంబ్లీకి, కాగ్, కేంద్ర ఆర్థిక సంస్థలకు తెలియకుండా ఎందుకు దాచారు? అని ప్రశ్నించారు. మంత్రివర్గం అవినీతి, దుబారా చేస్తున్నందునే సమాచారాన్ని రాజ్యాంగ సంస్థలకు తెలియకుండా తొక్కిపెట్టారని అని ఆరోపించారు. మంత్రివర్గం చేసిన తప్పిదాలకు అధికారుల, ఉద్యోగులను బాద్యులను  చేసి శిక్ష వేయడాన్ని అన్ని వర్గాలు ఖండిస్తున్నాయని... తెలుగుదేశం పార్టీ కూడా తీవ్రంగా ఖండిస్తోందన్నారు. 
 
''తెలుగుదేశం ప్రభుత్వం కన్నా వైసీపీ ప్రభుత్వం సంక్షేమానికి ఎక్కువేమి ఖర్చు చేయలేదు. ఫీజు రీయింబర్స్ మెంట్  తెలుగు దేశం ప్రభుత్వం 16లక్షల మందికి ఇవ్వగా.. దాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం 11లక్షల మందికి కుదించింది. చంద్రన్న బీమా 2.47 కోట్ల మందికి వర్తింపజేయగా, వైసీపీ ప్రభుత్వం 67 లక్షలకే కుదించింది. తెలుగుదేశం ప్రభుత్వం సున్నా వడ్డీ రైతు రుణాలను రూ.3 లక్షల వరకు వర్తింపజేయగా జగన్ రెడ్డి రూ.లక్షకు కుదించారు. డ్వాక్రా రుణాలకు సున్నా వడ్డీని టీడీపీ రూ.3 లక్షల వరకు వర్తింపజేయగా జగన్ రెడ్డి రూ.లక్షకే కుదించారు'' అని తెలిపారు. 

read more   దాడి సమయంలో పోలీసులు రెండు కి.మీ. దూరంలోనే ఉన్నారు : దేవినేని ఉమ

''సంక్షేమ పథకాలు, కరోనా వల్ల అప్పు చేయాల్సి వచ్చిందనే వైసీపీ వాదనలో పసలేదు. కరోనాకు కూడ కేంద్రం ఇచ్చిన నిధులే ఖర్చు చేశారు తప్ప రాష్ట్రం నిధులు ఖర్చు చేసింది తక్కువే. అప్పుల సంక్షోభానికి మంత్రివర్గ అవినీతి, దుబారాలే  ప్రధాన కారణం. అలాగే వైసీపీ అరాచకం వల్ల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోవడం, కొత్త పెట్టుబడులు రాకపోవడం ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యాయి. తెలుగుదేశం ఎక్కువ అప్పులు చేయడంవల్ల నేడు ఆర్థిక సంక్షోభం వచ్చిందనే ఆర్థిక మంత్రి వాదన పచ్చి అబద్దం'' అన్నారు యనమల.
         
జగన్ రెడ్డి ప్రభుత్వం గత 25 నెలల్లో చేసిన అప్పుల వివరాలను యనమల బయటపెట్టారు. 
1.    2019-20                రూ.39,686.56 కోట్లు
2.    2020-21                రూ.55,161.51 కోట్లు 
3.    2021 ఏప్రిల్             రూ.19,714.04 కోట్లు 
4.    కార్పొరేషన్ల ద్వారా      రూ.34,650.00 కోట్లు 
                      మొత్తం: రూ.1,49,212.11 కోట్లు

ఆధారం : కాగ్ రిపోర్టు & ఎస్.టి.సి డాక్యుమెంట్స్ 
    
గతంలో చంద్రబాబు ప్రభుత్వం 60 నెలల్లో చేసిన అప్పుల వివరాలను కూడా యనమల బయటపెట్టారు. 

1.    2014-15         రూ.18,089.11 కోట్లు
2.    2015-16         రూ. 5,110.15 కోట్లు
3.    2016-17         రూ.23,559.96 కోట్లు
4.    2017-18         రూ.25,064.93 కోట్లు
5.    2018-19         రూ.38,282.83 కోట్లు 
         మొత్తం : రూ.1,30,146.98 కోట్లు 
ఆధారం : ఆర్.టీ. లెటర్ నెం.f 01-బడ్జెట్ /7/2020 C&M

''తెలుగుదేశం ప్రభుత్వం ఏడాదికి సరాసరిన రూ.26 వేల కోట్లు అప్పు చేయగా, వైసీపీ ప్రభుత్వం ఏడాదికి బడ్జెట్ అప్పులే సరాసరిన రూ.50 వేల కోట్లు చేసింది. బడ్జెట్ యేతర అప్పు రెండేళ్లలో మరో రూ.34 వేల కోట్లు చేసింది. అయినా రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి లేదు'' అని యనమల తెలిపారు.

''సాగునీటి ప్రాజెక్టులకు టీడీపీ రూ.64 వేల కోట్లు ఖర్చు చేసి 23 ప్రాజెక్టులు పూర్తి చేసి 32లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది. జగన్ రెడ్డి రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేసింది కేవలం రూ.9,450 కోట్లు మాత్రమే. తెలుగుదేశం రూ.36 వేల కోట్లు ఖర్చు చేసి 10 వేల మెగావాట్లు విద్యుత్ ను అధనంగా ఉత్పత్తి చేసి కరెంటు కోతలు నివారించింది. విద్యుత్ చార్జీలు పెంచిందే లేదు. జగన్ రెడ్డి ప్రభుత్వం సుమారు 1000 మెగావాట్లు మాత్రమే పెంచింది. టీడీపీ 27 వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మించగా.. వైసీపీ నిర్మించింది 300 కి.మీ మాత్రమే. ఇలా అభివృద్ధికి తెలుగుదేశం చేసిన ఖర్చుతో పోలిస్తే వైసీపీ  చేసింది దిగదుడుపే'' అన్నారు యనమల.

read more  ప్రభుత్వం సమాచారం లీక్... మరో పదిమంది ఉద్యోగులపైనా సస్పెన్షన్ వేటు

''జగన్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి లేదు. సంక్షేమం కుదించారు. అయినా మితిమీరి అప్పులు చేశారు? అవినీతి కోసమే అప్పులు చేశారు. ప్రతి స్కీంలోనూ స్కాం చేశారు. సెంటు పట్టా పేరుతో అధిక ధరలకు భూములు కొని, మెరక పేరుతో రూ.6,500 కోట్లు తినేశారు. ఉచిత ఇసుక పాలసీని రద్దు చేసి ఇసుక ధరలు పెంచి వేల కోట్ల దోపిడీ చేస్తున్నారు. గనుల్లోనూ వేల కోట్లు దోపిడీ చేస్తున్నారు. అలాగే దుబారా కూడా తారాస్థాయిలో చేస్తున్నారు'' అని ఆరోపించారు. 

''ప్రభుత్వ భవనాలకు, ఆస్తులకు వైసీపీ జెండా రంగులు వేయడానికి వేల కోట్లు దుబారా చేశారు. సలహాదారుల పేరుతో, కోర్టు ఖర్చుల పేరుతో, బియ్యం వాహనాల పేరుతో, 104, 108 అంబులెన్సుల పేరుతో, వాలంటీర్ల పేరుతో, పత్రికా ప్రకటనల పేరుతో వేల కోట్లు దుబారా చేస్తున్నారు'' అన్నారు. 

''వైసీపీ నేతల అరాచకాలతో దాడుల వలన పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. వైసీపీ ఎంపీ బెదిరింపులతో 17 కియా అనుబంధ సంస్థలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. రూ.24 వేల కోట్లతో రామాయపట్నంకు వచ్చిన అసియా పేపరు మిల్లు వెళ్లిపోయింది. లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోయాయి. కొత్త పెట్టుబడులు రాలేదు. అయినా వారి అవినీతి, దాడులు విరమించుకోలేదు. అమరరాజా ఫ్యాక్టరీ ఒక్క దాని వల్లే రాష్ట్రానికి జీఎస్టీ ద్వారా రూ.1,200 కోట్లు ఆదాయం వస్తోందని వార్త. రాజకీయ కక్షతో దాన్ని తమిళనాడుకు తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు. భారతి సిమెంటు ఫ్యాక్టరీలోను, అరబిందో ఫార్మాలోను ఎక్కువగా పొల్యూషన్ ఉంది. అమరరాజా ఫ్యాక్టరీ వలన పొల్యూషన్ వస్తోందని స్థానికుల నుండి ఇంత వరకు ఒక్క ఫిర్యాదు కూడా రాని మాట వాస్తవం కాదా.?'' అని ప్రశ్నించారు. 

''రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభానికి వైసీపీ నేతల అవినీతి, దుబారా, అరాచకం, పెట్టుబడులు తరిమేయడమే ప్రధాన కారణాలే కానీ.. సంక్షేమం, కరోనా కాదు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులతో, అధికారులు, ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ వారి దోపిడీ నుండి దృష్టి మళ్లిస్తున్నారు. సెక్రటేరియేట్ ఉద్యోగులపై చర్యలు కూడా ఈ కోవలోనివే. తప్పులు మంత్రివర్గానివి. శిక్షలు అధికారులకు, ఉద్యోగులకా?'' అని యనమల ప్రశ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios