Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వం సమాచారం లీక్... మరో పదిమంది ఉద్యోగులపైనా సస్పెన్షన్ వేటు

ఇప్పటికే ప్రభుత్వ సమాచారాన్ని లీక్ చేస్తున్నారంటూ ముగ్గురు ఆర్థిక శాఖ ఉద్యోగులను సస్పెండ్ చేసిన జగన్ సర్కార్ అదేబాటలో మరో 10మంది ఉద్యోగులపైనే వేటు వేసింది. 

another ten govt employees suspended for data leak issue akp
Author
Ibrahimpatnam, First Published Aug 5, 2021, 9:37 AM IST

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులపై మరోసారి కన్నెర్ర చేసిన ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే ఆర్థిక శాఖలో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేసిన జగన్ సర్కార్ అదేబాటలో మరో 10మంది ఉద్యోగులపైనా వేటు వేసింది. కృష్టా జిల్లా ఇబ్రహీంపట్నం సీఎఫ్ఎమ్ఎస్ కార్యాలయంలో మరో 10 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఒకేరోజు 10మంది ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో మిగతా ఉద్యోగుల్లో కలవరం మొదలయ్యింది.  

ఆర్ధిక శాఖలో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్స్ జరిగిన కొన్ని గంటలకే మరో శాఖలో ఉద్యోగులపై వేటు వేయడంపై ఉద్యోగ వర్గాల్లోనే కాదు రాజకీయంగా చర్చకు దారితీసింది. ప్రభుత్వానికి సంబంధించిన విలువైన సమాచారం బయటకు ఇస్తున్నరని అభియోగంతో వీరందరిపై వేటు పడింది.  

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన సమాచారం బయటకు వస్తోంది. ఏపీ ఆర్థిక పరిస్థితిపై పక్కా సమాచారంతో కధనాలు వెలువడంతో అధికారులే కాదు మంత్రులు సైతం వాటిని అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదని... అప్పులు చేయాల్సి వస్తుందని బహిరంగంగానే అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉద్యోగులపై నిఘా పెట్టిన ప్రబుత్వం డాటా లీక్ చేశారని అనుమానిస్తూ కొందరిని సస్పెండ్ చేసింది. 

read more  ఏపీ ఈఎస్ఐ స్కాం: నలుగురి అరెస్ట్, వెలుగులోకి కీలక విషయాలు

ఆర్ధిక శాఖలో పనిచేసే ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లతో పాటు ఒక అసిస్టెంట్ సెక్రెటరీని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఆర్థిక శాఖలో సెక్షన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న డి. శ్రీనిబాబు, కే. వరప్రసాద్, అసిస్టెంట్ సెక్రెటరీ నాగులపాటి వెంకటేశ్వర్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.  

ఇటీవల ఆర్థిక శాఖకు చెందిన సమాచారం లీక్ అవుతుండటంతో ఉద్యోగులపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే ఈ ముగ్గురు ప్రభుత్వ సమాచారని లీక్ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో వారిని సస్పెండ్ చేసింది జగన్ సర్కార్.  ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్యార్టర్ విడిచి వెళ్లరాదని వారిని ప్రభుత్వం ఆదేశించింది. ఇదే సమయంలో మరో 10మంది ఉద్యోగులపైనా సస్పెన్షన్ వేటు వేసింది. 


 


 

Follow Us:
Download App:
  • android
  • ios