గుంటూరు: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని... వృద్దిరేటు, తలసరి ఆదాయం, అప్పుల వివరాలను ప్రజలకు వెల్లడించాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.  ఇకనైనా తన అబద్దాలతో ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన అప్పుల గురించి మాయమాటలు చెప్పడం మానుకోవాలని... వాస్తవాలు బైటపెట్టాలని సూచించారు. 

''గత ఏడాదిలో రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్లు ఎంత..? ఏ పద్దు కింద ఏయే రంగాలకు ఎంతెంత నిధులు వచ్చాయి..? గత ఏడాది రెవిన్యూలోటు ఎంత..? ద్రవ్యలోటు ఎంత..? ప్రాథమిక లోటు ఎంత..? తెచ్చిన రుణాలు ఎంత..? జిఎస్ డిపిలో అప్పుల నిష్పత్తి ఎంత..? జిఎస్ డిపిలో పన్నుల నిష్పత్తి ఎంత..? గ్రాస్ ఫిస్కల్ కేపిటల్ ఫార్మేషన్(జిఎఫ్ సిఎఫ్) ఎంత..? సంపద సృష్టికి ఖర్చు చేసిందెంత..? సంక్షేమానికి చేసిన ఖర్చెంత..? వ్యవసాయం అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవారంగంలో పురోగతి ఎంతెంత..?'' అని ప్రశ్నించారు. 

''ఏ రంగానికి ఎంతెంత బడ్జెట్ పెట్టారు..? ఆయా రంగాల్లో ఎంతెంత ఖర్చు పెట్టారు..? ప్రతి రంగంలో కోత పెట్టిందెంత..? ఎకనామిక్ గ్రోత్ రేట్ ఎంత..? తలసరి ఆదాయం ఎంత..? తలసరి ఆదాయంలో వృద్ది ఎంత..? అన్ని వివరాలు శ్వేత పత్రంలో వెల్లడించాలి. వీటన్నింటిని ఎందుకు దాస్తున్నారు..? దాస్తున్నారంటే తప్పులు చేసినట్లే కదా..? వాస్తవాలైతే దాయాల్సిన అవసరం ఏమిటి..? మీవే గనుక నిజాలైతే మేము సరిదిద్దుకుంటాం'' అన్నారు. 

read more   అలాగయిలే చరిత్రహీనుల్లా మిగిలిపోతాం... జాగ్రత్త: చంద్రబాబు హెచ్చరిక

''మీ వైఫల్యాలను కరోనాపై, లాక్ డౌన్ లపై నెట్టి తప్పించుకోలేరు. గత ఆర్ధిక సంవత్సరంలో కరోనా ప్రభావం 9రోజులే. కరోనా కంటె నాలుగైదు రెట్ల నష్టం ‘‘జగోనా’’(వైసిపి పాలన) వల్ల జరిగింది. స్టేట్ ఎకానమి పడిపోయిందని సాక్షితో సహా మీడియా మొత్తం వెల్లడించింది. సాక్షిలో వచ్చేవి అబద్దాలని సీఎం జగన్ అసెంబ్లీలోనే చెప్పారు. ఇదికూడా అబద్దమేనని బుగ్గన మరోసారి చెప్పారు. దీనిని బట్టే సాక్షిని నమ్మాలో వద్దో ప్రజలే నిర్ణయిస్తారు''  అని పేర్కొన్నారు.

''అనుభవం టిడిపిది అయితే అబద్దాలు వైసిపివి అని ప్రజలకు ఇప్పటికే అర్ధం అయ్యింది. మీ అబద్దాలతో మా అనుభవాన్ని హేళన చేయాలని అనుకుంటే అది సాధ్యం కాదు'' అంటూ వైసిపి ప్రభుత్వాన్ని యనమల హెచ్చరించారు.