Asianet News TeluguAsianet News Telugu

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన యనమల

ఏపిలో పంచాయితీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తోందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. ముఖ్యమంత్రి ఎంత అహంభావంతో వ్యవహరించారో సుప్రీంకోర్టు వ్యాఖ్యలే నిదర్శనమని తెలిపారు.

yanamala ramakrishnudu on supreme court verdict on ap local body elections - bsb
Author
Hyderabad, First Published Jan 25, 2021, 3:09 PM IST

ఏపిలో పంచాయితీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తోందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. ముఖ్యమంత్రి ఎంత అహంభావంతో వ్యవహరించారో సుప్రీంకోర్టు వ్యాఖ్యలే నిదర్శనమని తెలిపారు.

చట్టానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం ఏదో వంకన ఎన్నికలను ఆపాలని చూడటం, దానికి ఉద్యోగ సంఘాల నాయకులు వత్తాసు పలకడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించిందన్నారు.

వెంటనే పంచాయితీ ఎన్నికలు జరపాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపై, ఎన్నికల సంఘంపై ఉందని గుర్తు చేశారు. రెండోవైపు చూడకుండా పంచాయితీ ఎన్నికలు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని కోరారు. దీనికి ప్రభుత్వం కూడా సహకరించాలి, ఎన్నికల సంఘం కూడా సహకరించాలన్నారు. 

పంచాయితీ ఎన్నికలు వెంటనే నిష్పాక్షికంగా, స్వేచ్ఛాయుతంగా జరిపించేలా ఎన్నికల సంఘం చూడాలి. రాజ్యాంగ విధులను, రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఎవరైనా అరాచకాలు సృష్టించాలని చూస్తే ఎన్నికల సంఘమే తగిన చర్యలను చేపట్టాలని 
యనమల రామకృష్ణుడు అన్నారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios