Asianet News TeluguAsianet News Telugu

‘దారి’తప్పిన జీవితం

  • రాంగ్ రూట్ డ్రైవ్ తో ప్రాణం పోగొట్టుకున్న యువతి
  • తిరుపతిలో ఘటన.. సిసి టివి లో రికార్డు
wrong root drive kills

అందరూ వెళ్తున్నారుగా అని రాంగ్ రూట్ లో వెళ్లిన మహిళ చివరికి మృత్యు ఒడిలోకి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్డులో బుధవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

ఎదురుగా భారీ వాహనాలు వస్తున్నా అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా రాంగ్ రూట్ లోనే వెళ్తున్నారు. స్కూటీ మీద వెళ్తున్న ఓ యువతి కూడా వారినే ఫాలో అయింది. కానీ, దురదృష్టం ఆమెను యాక్సిడెంట్ రూపంలో బలితీసుకుంది.

రాంగ్ రూట్ లో వెళ్తూ ఎదురుగా వస్తున్న వాహనానికి ఢి కొట్టి పడిపోయిన ఆ యువతి దృశ్యాలు సిసి టివిలో రికార్డయ్యాయి.

 

https://www.youtube.com/watch?v=QqZzjNetD9M

 

కింద పడిపోయిన ఆ యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలించే లోపే ఆమె మరణించింది.

Follow Us:
Download App:
  • android
  • ios