కాల్వకు మంత్రి పదవి? - బోయలకు ఉగాది కానుక?

would Naidu reward kalva Srinivas with cabinet berth to please boyas
Highlights

కాల్వ శ్రీనివాసులుకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల ‘బోయలకు ఎస్ టి హోదా’  అనేఎన్నికల హామీని వాయిదా వేయవచ్చు

అనంతపురం జిల్లానుంచి క్యాబినెట్ జాక్ పాట్ కొట్టేదెవరు?

 

కాల్వ శ్రీనివాసులా, పార్థ సారధియా లేక పైయ్యావుల కేశవా?

 

జిల్లాలో  చర్చ బాగా నడస్తూ ఉంది.అందులో కాలువ శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినపడుతూ ఉంది. ఆయన నిరాడంబరంగా ఉంటారు.  వివాదల్లో తల దూర్చలేదు. మెతకగా  కనిపిస్తూనే  ఈ మధ్య అసెంబ్లీలో  బాగా మాట్లాడుతున్నవారిలో ఒక డయ్యారు. పార్టీ లైన్ బాగా ముందుకు తీసుకువెళ్లున్న బిసి  నాయకుడని పేరు తెచ్చకున్నాడు. ఇంతకంటేముఖ్యంగా  ఆయనకు మరొక అర్హత తోడవుతూ ఉంది. ప్రస్తుతం బిసిలుగా ఉన్న  బోయలను ఎస్ టిలుగా మారుస్తానని  తెలుగుదేశం నేత ఎన్నికలపుడు హడావిడి చేశారు. ఇపుడా వూసే లేదు.పక్కనున్న కర్నాటకలో బోయలు బిసిలు. ఇది ఆ కులస్థులు అన్ని రంగాలలో ముందుకు పోయేందుకు బాగా పనికొచ్చింది. కర్నాటక  అసెంబ్లీలో  17 మంది బోయలున్నారు.  

 

 అనంతపురం, కర్నూల్ జిల్లాలలో బోయప్రాంతాలన్నీ కూడా కర్నాటక బోయ ప్రాంతాల కొనసాగింపే. అయితే,  2014 ఎన్నికలుగెల్చి ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు నాయుడు ఈ హమీ వల్లె వేయడమే తప్ప  అమలుచేసేందుకు  చేసిందేమీ లేదు. అందువల్ల బోయలలో  ఈ అసంతృప్తి వుంది అని బోయకులానికి చెందిన ప్రొఫెసర్ ఒకరు ఏసియానెట్ కు చెప్పారు. 

 

బోయలు కాపుల లాగా సంఘటితం అయ్యే స్థితిలో లేరు కాబట్టి వారు  ఈ డిమాండ్ మీద ఉద్యమాల వైపు వెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి ,  బోయకులానికి చెందిన కాలువ శ్రీనివాసులు కు చీఫ్ విప్ పదవి ఇచ్చి  ‘ఎంత చేశానో ’ చూడండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

 

చీఫ్ విప్ అనేది పైకి కనిపించేటంత హంగు లున్న పదివికాదు. అందువల్ల ఆయనను మంత్రిని చేస్తే జిల్లాలో బోయ  సందడి మొదలవుతుందని,  2019 దగ్గరవుతున్న ఈ సమయంలో  నాయుడు భావిస్తున్నాడని  కొంతమంది టిడిపి నాయకులు చెబుతున్నారు.

 

అందువల్ల బిసిలకు ఏదో చేసినట్లూ ఉంటుండి, బోయలను కొంతయిన సంతృప్తిపరిచినట్లూ ఉంటుంది. దీనితో బోయలను ఎస్ టిలుగా మార్చుతానన్న డిమాండ్ ను 2019 తర్వాతికి వాయిదా వేయవచ్చనేది ఆయన వ్యూహం కావచ్చంటున్నారు.

 

తర్వాత, కాల్వ శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇచ్చినందున జిల్లాలో ఏ వర్గమూ అసంతృప్తి చెందదు. చెందిన పైకి వెల్లగక్క లేదరు.  ఆయనకు ఉన్న మంచి పేరు అలాంటిది.  1999 నుంచి రాజకీయాలలో ఉన్నా  చెక్కు చెదరని ప్రతిష్ట ఉన్నవాడు కాల్వ. సాధారణ ప్రజల ముఠాలో తప్ప ఏ రాజకీయ ముఠాలలో చేరని వాడు. జిల్లా టిడిపి లో ఉన్న ముఠాలకు ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలో ఉంటాడు. ఎవరిని ప్లీజ్ చేసేందుకు ‘అతి’ చేయడు. చంద్రబాబు తో హాట్ లైన్ ఉన్న కొద్ది మంది  కమ్మేతర నాయకులలో ఆయనే నెంబర్ వన్ అని పేరుంది.

 

రెడ్ల ను మచ్చిక చేసుకునేందుకు రెడ్లను ఎక్కువగా ప్రోత్సహించినందున వచ్చిన ప్రయోజనమేమీ లేదని, ఇప్పటి నుంచయినా సరే బిసిలకు చోటివ్వాలని పెద్దాయన, చిన్నబాబు అనుకుంటున్నారని భోగట్టా.

మరొక రెండు పేర్లు కూడా మంత్రి వర్గం రేసులో ఉన్నాయి. అవి  పేనుగొండ  ఎమ్మెల్యే పార్థ సారధి(కురబ , బిసి). ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ (కమ్మ).  

 

జిల్లా రాజకీయాలను  కులం ‘కమ్మే’సిందని జెసి బ్రదర్  నెంబర్ వన్ అనంతపురంలో ధర్నా చేసి మరీ చెప్పారు.

 

అందువల్ల బిసికి, అందునా చదువుకున్న వాడు, వివాద రహితుడు అయన కాల్వ కు మంత్రి పదవి ఇవ్వడం సేఫ్ గా ఉంటుందని నాయుడు భావించే  అవకాశం మెండుగా ఉందని చెబుతారు. ఈ అంచనాలు నిజమవుతాయా లేక ఉహాగానాలేనా;  దీని కోసం ఉగాది దాకా వేచి  చూడాల్సిందే.

 

 ఎందుకంటే, ఒక్క చిన్నబాబును మాత్రమే క్యాబినెట్ లోకి తీసుకుకుంటాడని, మిగతా  ఎవ్వరి జోలికి వెల్లడనే వాదనకూడా పార్టీలో వినపడుతూ ఉంది. 

loader