వైసీపీలో చేరుతున్న శిల్పాకు జగన్ టిక్కెట్టు ఇవ్వకుండా ప్రచారంలో ఉన్న నేతల్లో ఎవరో ఒకరిని నిలబెట్టి గెలుపుకోసం పనిచేయించాలని కోరుకుంటున్నారు. అలాచేస్తే పార్టీలో జగన్ ఇమేజ్ పెరుగుతుంది. అలాకాక కొత్తగా పార్టీలో చేరుతున్న శిల్పాకు టిక్కెట్టు కేటాయిస్తే నేతల్లో జగన్ పై నమ్మకం పోతుంది.
జగన్మోహన్ రెడ్డికి కొత్త తలనొప్పి మొదలైంది. ఇంతకాలం టిడిపిలో ఉన్న శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించటంతో నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి విషయంలో హీట్ పెరిగిపోతోంది. శిల్పా టిడిపిలో ఉన్నంత కాలం అధికారపార్టీ తరపున పోటీ చేసే అవకాశం చంద్రబాబునాయుడు ఎవరికిస్తారో అర్ధం కాలేదు. అయితే, శిల్పా ఎప్పుడైతే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారో టిడిపి తరపున పోటీలో భూమా కుంటుంబంలోని వారే ఉంటారన్న విషయంలో క్లారిటీ వచ్చేసినట్లే.
అప్పటి వరకూ వైసీపీలో ఈ విషయమై పెద్దగా సమస్య ఎదురుకాలేదు. ఇద్దరి ముగ్గురు పేర్లు ప్రచారంలోకి వచ్చినా అంతిమ నిర్ణయం జగన కే వదిలిపెట్టారు. ఇటీవల జరిగిన ప్లీనరీ సమావేశాల్లో కూడా నంద్యాలలో పోటీ చేయబోయేది రాజగోపాల రెడ్డేనని, కాటసాని కుటుంబమేనని, గంగుల ప్రతాపరెడ్డని ప్రచారం జరిగింది. అయితే, అధికారికంగా ప్రకటన రాలేదు.
ఇటువంటి పరిస్ధితుల్లో హటాత్తుగా శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలోకి వస్తున్నారు. దాంతో అందరిలోనూ అయోమయం మొదలైంది. ఎందుకంటే, శిల్పా టిడిపికి రాజీనామా చేసిందే అక్కడ పోటీ చేసేందుకు అవకాశం రాదని. అంటే, నంద్యాలలో పోటీ చేసేందుకే వైసీపీలో చేరుతున్నారన్న విషయంలో ఎవరికి అనుమానాల్లేవు. ఒకవేళ శిల్పాకే గనుక జగన్ పోటీ చేసే అవకాశం ఇస్తే, పార్టీలోనే మొదటి నుండి ఉన్న వారి పరిస్ధితేంటి? ఇప్పటి వరకూ ప్రచారంలో వారి పరిస్ధితేంటన్నది అర్ధం కావటం లేదు.
ఇదే విషయమై వైసీపీ నేతల మధ్య చర్చ జరుగుతోంది. వైసీపీలో చేరుతున్న శిల్పాకు జగన్ టిక్కెట్టు ఇవ్వకుండా ప్రచారంలో ఉన్న నేతల్లో ఎవరో ఒకరిని నిలబెట్టి గెలుపుకోసం పనిచేయించాలని కోరుకుంటున్నారు. అలాచేస్తే పార్టీలో జగన్ ఇమేజ్ పెరుగుతుంది. అలాకాక కొత్తగా పార్టీలో చేరుతున్న శిల్పాకు టిక్కెట్టు కేటాయిస్తే నేతల్లో జగన్ పై నమ్మకం పోతుంది.
