దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఇమేఙ్ ని డ్యామేజ్ అయ్యేలా సినిమా తీస్తే ఒప్పుకునేది లేదని టిడిపి ఎంఎల్ఏ అనిత రామ్ గోపాల్ వర్మను హెచ్చరిస్తున్నారు. తానే కాదట ఏ టీడీపీ కార్యకర్తా అంగీకరించరట.
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఇమేఙ్ ని డ్యామేజ్ అయ్యేలా సినిమా తీస్తే ఒప్పుకునేది లేదని టిడిపి ఎంఎల్ఏ అనిత రామ్ గోపాల్ వర్మను హెచ్చరిస్తున్నారు. తానే కాదట ఏ టీడీపీ కార్యకర్తా అంగీకరించరట. విచిత్రంగా లేదూ అనిత హెచ్చరిక. గురువారం మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ను పరోక్షంగా ఇబ్బందిపెట్టేలా వర్మ గనుక సినిమా తీస్తే, బ్రతికున్న జగన్ పై కూడా సినిమాలు తియ్యడానికి చాలామంది సినీ నిర్మాతలు సిద్ధంగా ఉన్నారంటున్నారు. ‘బోడిగుండికి మోకాలికి ముడి పెట్టటం’ టిడిపి నేతలకు తెలిసినట్లు ఇంకెవరికీ తెలీదేమో.
రేట్టింగ్స్ కోసమో లేకపోతే పబ్లిసిటీ కోసమో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఈవిడగారు అంగీకరించరట. ఎవరో పెట్టుబడి పెడుతున్నారు, ఇంకెవరో సినిమా తీస్తున్నారు. మధ్యలో ఈవిడగారు అంగీకరించకపోవటమేంటో అర్ధం కావటం లేదు. ఎన్టీఆర్ పై నెగిటివ్ గా సినిమా తీస్తే ఎంఎల్ఏ గారు ఊరుకోరట.
ఎన్టీఆర్ పై సినిమా తియ్యడం, రాజకీయ నాయకురాలిగానే కాకుండా కామన్ మ్యాన్ కూడా ఆవిడ అంగీకరించరట. అందుకే ఎన్టీఆర్ కి ప్రజల్లో ఉన్న అభిమానాన్ని, నమ్మకాన్ని వమ్ము చెయ్యొద్దంటూ వర్మను హెచ్చరిస్తున్నారు.
ఎన్టీఆర్ గురించి ఇన్ని మాటలు చెబుతున్న అనితకు అదే ఎన్టీఆర్ ను పదవిలో నుండి దింపేసినపుడు ఏవీ ఎందుకు గుర్తుకు రాలేదబ్బా? ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా అధికారంలో ఉండేది టీడీపీదేనట. సరే, ఆ విషయాన్ని తేల్చాల్సింది జనాలే కానీ అనిత కాదు కదా? మొత్తం మీద అనిత కూడా రామ్ గోపాల్ వర్మకు హెచ్చరికలు చేయటం కామిడీగా లేదు....
