రంగాపై వివాదాస్పద వ్యాఖ్యలను చేసిన వ్యక్తిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయటాన్ని అభిమానులతో పాటు తాను కూడా స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రంగా గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా ఊరుకునేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. రంగా అభీమానులు‌ పార్టీలకు అతీతంగా ఉన్నారని,. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు ఊరుకోరని చెప్పారు. గౌతమ్ రెడ్డి లాంటి స్థాయి లేని వ్యక్తి తన మనసులో ఉన్నమాటలు బయటపెట్టుకున్నట్లుగా అభిప్రాయపడ్డారు.
వంగవీటి రంగాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గౌతమ్ రెడ్డిపై రంగా కొడుకు, వైసీపీ నేత వంగవీటి రాధాకృష్ణ సోమవారం విరుచుకుపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ, గౌతమ రెడ్డి బ్రతుకేంటో అందరికీ తెలుసన్నారు. గతంలో సిపిఐని అడ్డుపెట్టుకుని గౌతమ్ రెడ్డి చేసిన భూదందాలు, దౌర్జన్యాలు అందరికి తెలుసని చెప్పారు. రెండు మర్డర్లు చేసి, భూదందాలు చేసి నగరబహిష్కరణకు గురైన వ్యక్తి మాటలకు విలువలేదని తేల్చేసారు.
రంగాపై వివాదాస్పద వ్యాఖ్యలను చేసిన వ్యక్తిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయటాన్ని అభిమానులతో పాటు తాను కూడా స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
రంగా గారి గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా ఊరుకునేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. రంగా అభిమానులు సంయమనంతో ఉండాలని, పార్టీ చర్యలు తీసుకోవాలని కోరేందుకే ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నట్లు రాధా తెలిపారు. కానీ పోలీసులు వేరేగా అర్ధం చేసుకుని ఆదివారం మీడియా సమావేశం పెట్టకుండా అడ్డుకున్నట్లు మండిపడ్డారు.
రంగా అభీమానులు పార్టీలకు అతీతంగా ఉన్నారు. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు ఊరుకోరని చెప్పారు. గౌతమ్ రెడ్డి లాంటి స్థాయి లేని వ్యక్తి తన మనసులో ఉన్నమాటలు బయటపెట్టుకున్నట్లుగా అభిప్రాయపడ్డారు. ఇలాంటి వాళ్ళను మొదట్లో తమ పార్టీ ప్రోత్సహించిందన్నారు. పార్టీ మారాలనుకుంటే తమను ఏమన్నా పర్వాలేదు కానీ చనిపోయిన రంగాను తిడితే ఎవరూ ఊరుకోరని స్పష్టం చేసారు.
పోలీసులు తమ బాసుల దగ్గర మార్కులకోసం నిన్నటి నుండి అత్యుత్సాహం ప్రదర్శించారని అబిప్రాయపడ్డారు. మహిళా కానిస్టేబుళ్ళు లేకుండా తన తల్లిని రోడ్డుపై ఈడ్చుకుని తీసుకెళ్ళటం దారుణమన్నారు. హాస్పటల్ కు తీసుకు వెళ్ళమన్నా వినలేదు దీని పై ఫిర్యాదు చేస్తాం. పోలీసులపై తాము ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
