కరోనా సోకిన దానికన్నా.. కోవిడ్ పరీక్షలు, ఫలితాల వచ్చిన తర్వాత ఆసుపత్రుల చుట్టూ తిరిగేందుకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అచ్చం ఇదే రకమైన సంఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని జాంపేట పిల్లావారి వీధికి చెందిన ఓ మహిళ ఈ నెల 23న అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. దీంతో ఆమెకు సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించారు. కానీ ఫలితాలు ఇంకా రాకపోవడం, ఆమె ఆరోగ్య పరిస్ధితి క్షీణించడంతో కుటుంబసభ్యులు ప్రైవేటు ఆసుపత్రిలో కోవిడ్ పరీక్షలు చేయించారు.

అందులో ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే చికిత్స అందించేందుకు ప్రైవేటు ఆసుపత్రులు నిరాకరించాయి. దీంతో కుటుంబసభ్యులు ఇంట్లోనే ఆ మహిళకు ఆక్సిజన్ అమర్చారు. ఇంత చేసినప్పటికీ ఆమె పరిస్థితి విషమిస్తుండటంతో కుటుంబసభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 

Also Read:కర్నూలు జిల్లాలో పెళ్లి కూతురికి కరోనా: రేపు జరగాల్సిన పెళ్లి వాయిదా