టిక్ టాక్ పిచ్చి రోజు రోజుకు ముదిరిపోతోంది. దీనిపై మోజుతో డ్యూటీలను సైతం పక్కనబెట్టి పలువురు ప్రభుత్వ ఉద్యోగులు టిక్ టాక్ వీడియోలు చేస్తూ.. ఉద్యోగాలను పొగొట్టుకుంటున్నారు.

అయినప్పటికీ మిగిలిన వారిలో మార్పు మాత్రం రావడం లేదు. తాజాగా అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వాసుపత్రి సిబ్బంది రోగులకు వైద్యాన్ని అందించడం మానేసి టిక్ టాక్‌లో మునిగి తేలుతున్నారు.

కదిరి ఆసుపత్రి ల్యాబ్‌లో సిబ్బంది టిక్ టాక్‌తో కాలక్షేపం చేస్తున్నారు. ఎంతకీ తమను పట్టించుకోకపోవడంతో రోగులు ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు.

దీంతో ల్యాబ్ టెక్నీషియన్‌ను ఉద్యోగంలోంచి తొలగించారు. టిక్ టాక్ మోజుతో ఇప్పటికే కరీంనగర్, ఖమ్మం, సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పలువురు సిబ్బంది తమ ఉద్యోగాలను పొగొట్టుకున్నారు.