ఇటీవల భర్త చేతిలో ఆస్పత్రిలో లైంగిక దాడికి పాల్పడిన పద్మ అనే మహిళ ... కన్నుమూసింది. చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మూడు రోజుల కిందట పద్మ అనే మహిళపై  భర్త నంద లైంగికదాడికి పాల్పడిన విషయం తెలిసిందే. 

తన కుమార్తెకు జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్న సమయంలో తన లైంగిక వాంఛ తీర్చాలంటూ పద్మను నంద తీవ్రంగా వేధించడం.. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో బలవంతంగా ఆస్పత్రి మిద్దెపైకి తీసుకెళ్లి లైంగిక దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నించాడు.  

ఈ ఘటనలో ఆమె అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు రక్తస్రావం ఎక్కువయ్యి పద్మ కోమాలోకి వెళ్లిపోయింది. గత మూడు రోజులుగా ఐసీయూలో పద్మను కాపాడటానికి వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. పద్మను చంపడానికి ఆమె చీరతోనే గొంతుకు బిగించడంతో మెడదుకు రక్త సరఫరా అయ్యే నాళాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. పద్మ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. 
 
నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని.. అతనిపై హత్యా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.