రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మహిళలు ప్రభుత్వ మద్యం పాలసీపై ఆందోళన బాటపట్టటం గమనార్హం. ఎక్కడికక్కడ ధర్నాలు, నిరాహారదీక్షలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఎక్సైజ్ స్టేషన్ల ముట్టడికి కూడా కొన్ని చోట్ల ప్రయత్నించటం విశేషం.
మద్యం అమ్మకాలపై మహిళాలోకం ఒక్కసారిగా మండిపడుతోంది. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మహిళలు ప్రభుత్వ మద్యం పాలసీపై ఆందోళన బాటపట్టటం గమనార్హం. ఎక్కడికక్కడ ధర్నాలు, నిరాహారదీక్షలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఎక్సైజ్ స్టేషన్ల ముట్టడికి కూడా కొన్ని చోట్ల ప్రయత్నించటం విశేషం. ఎప్పుడైతే మహిళలు ఉద్యమిస్తున్నారు ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్ధితులు తలెత్తాయి.
ఇళ్ళ మధ్య దుకాణాలు తొలగించాలని, బడులకు, గుళ్ళకు సమీపంలో షాపులను తీసేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర, జాతీయ రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం దుకాణాలు, బార్లు ఉండకూడదని సుప్రింకోర్టు ఆదేశాల నేపధ్యంలో షాపులు, బార్ల యజమానులకు ఇళ్ళు, గుళ్ళ, బడులకు సమీపంలోనే వ్యాపారాలను మొదలుపెట్టేసారు. దానికి వ్యతిరేకంగానే మహిళా లోకం నడుం బిగించింది.

మద్యం దుకాణాలను వెంటనే తొలగించాలంటూ పెద్ద ఎత్తున మహిళలు సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందచేసారు. అధికారులు స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. గుంటూరులో మహిళలు రిలే నిరాహా దీక్షలకు దిగటం పలువురికి మింగుడుపడనిదే. ఎందుకంటే, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మొదలైన మద్యం వ్యతిరేక ఉద్యమం దాదాపు రాజకీయాలకు సంబంధం లేకుండానే మొదలైంది. ఎప్పుడైతే మహిళలు మూడ్ గమనించాయో అప్పుడే వివిధ పార్టీలు మద్య వ్యతిరేక పోరాటాలకు మద్దతు ప్రకటించటం గమనార్హం.
అనంతపురం జిల్లా రాయదుర్గంలో మహిళలు, స్ధానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేసారు. విశాఖపట్నం జైలు రోడ్డులో వైన్ షాపు వద్ద పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరంలో మద్యం దుకాణాలు వద్దంటూ ఆడవాళ్లు ధర్నా చేసారు.

కర్నూలు జిల్లా మహానందిలో మహిళలు నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి రజక చెరువు ప్రాంతంలో ప్రజలు మద్యం వ్యాపారానికి వ్యతిరేకంగా రాస్తారోకో జరిపారు. విజయనగరం జిల్లాలో మద్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారిని పోలీసులు అరెస్టులు చేయటంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. గుంటూరులో మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా మహిళలు రిలే నిరాహాదీక్షలు చేపట్టటం సర్వత్రా ఆశక్తికరంగా మారింది.
