ఉయ్యూరులో దారుణం... మహిళా వాలంటీర్ పై వైసిపి నేత లైంగిక వేధింపులు (వీడియో)
మహిళా వాలంటీర్ పై వైసిపి నేత లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో వెలుగుచూసింది.

పెనమలూరు : అధికార వైసిపి మహిళా కౌన్సిలర్ భర్త తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళా వాలంటీర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు కూడా అతడివైపే మట్లాడుతూ రాజీ చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తుంది. దీంతో తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ ముందు ఆందోళనకు దిగింది. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమూలూరు నియోజకవర్గంలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా ఉయ్యూరు మునిసిపాలిటీ రెండో వార్డు కౌన్సిలర్ సుభద్ర వ్యవహరిస్తున్నారు. అయితే అధికారిక కార్యక్రమాలన్నీ ఆమె భర్త సురేష్ చూసుకుంటాడు. అయితే తాజాగా ఆ వార్డు వాలంటీర్, దళిత మహిళ గమ్యశ్రీపై అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణ చేస్తోంది. కొద్దిరోజుల క్రితం తన ఇంటికి వచ్చిన సురేష్ కోరిక తీర్చాలంటూ అసభ్యంగా ప్రవర్తించినట్లు వాలంటీర్ చెబుతోంది. అయితే అతడి వేధింపుల గురించి బయటపెడితే తనగురించి ఏమనుకుంటారో? కుటుంబం అల్లరి అవుతుందని భావించి ఈ విషయం బయటపెట్టలేదని గమ్యశ్రీ తెలిపారు.
వీడియో
వేధింపుల విషయం ఎవ్వరికీ చెప్పకుండా మౌనంగా వుండటంతో వైసిపి నేత సురేష్ మరింత చేష్టలు మరీ మితిమీరిపోయానని... మానసికంగా, శారీరకంగా వేధింపులు మరీ ఎక్కువయ్యాయని తెలిపింది. దీంతో ఇక సహించలేక భర్త, కుటుంబసభ్యులకు చెప్పగా అందరం కలిసి కౌన్సిలర్ ఇంటికి వెళ్లినట్లు తెలిపింది. కానీ తమను కులం పేరుతో దూషించి అక్కడినుండి గెంటేసారని వాలంటీర్ ఆవేదన వ్యక్తం చేసింది.
పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేస్తే అయినా తమకు న్యాయం జరుగుతుందని వాలంటీర్ కుటంబం భావించింది. దీంతో ఈ నెల 15 పోలీసులకు ఫిర్యాదు చేసామని... అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేరని వాలంటీర్ వాపోయారు. అందువల్లే మరోసారి పోలీస్ స్టేషన్ కు వచ్చి న్యాయం చేయాలని కోరుతున్నట్లు బాధిత మహిళ తెలిపింది. పోలీసులు మాత్రం కేసు నమోదు చేయకుండా రాజీ చేసుకోవాలని అంటున్నారని వాలంటీర్ గమ్యశ్రీ తెలిపారు.