మహిళలు బయట తిరిగాలంటేనే ఇబ్బంది పడిపోతున్నారు. రోడ్డు మీదకు వస్తే చాలు ఆకతాయిల గోల మొదలవుతోంది. దాంతో చాలా మంది మహిళలు, అమ్మాయిలు ఎంతో ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, తనను ఇబ్బంది పెట్టిన ఒక ఆకతాయిని ఓ మహిళ ధీటుగా ఎదర్కొంది. చొక్కా పట్టుకుని నలుగురిని పిలిపించి మరీ వాయించేసింది. మీరే చూడండి ఆమె ధైర్యాన్ని. విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న  రోగిని చూడటానికి మహిళ వచ్చింది. ఇంకేముంది ఒంటరిగా దొరికిందనుకున్నాడు ఓ ఆకతాయి. దాంతో రెచ్చిపోయి అసబ్యంగా ప్రవర్తించడంతో మహిళ స్ధానికుల సహకారంతో ఆకతాయి పై తిరగబడింది. చొక్కా పట్టుకుని నిలేసింది. అంతేకాకుండా  పోలీసులకు అప్పగించాలనుకున్నది. ఆ ప్రయత్నంలో ఉండగానే ఆకతాయి పారారయ్యాడు. మహిళ ప్రతిఘటించే విధానం చూసి పలువురు ఆమేను అబినందించారు.