ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. నందలూరు మండలానికి చెందిన దంపతులకు ముగ్గురు పిల్లలు. వారు విడిపోయాక చిన్నపిల్లాడు తల్లివద్దే ఉంటున్నాడు. ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అడ్డుగా కనిపించిన కొడుకును వారిద్దరూ చితకబాదారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కుమారుడు మరణించాడు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్తతో విడిపోయి వేరుగా ఉంటున్నది. మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్నది. ఆమె వద్ద మూడో కొడుకైన మాటలు రాని కొడుకు ఉంటున్నాడు. పదేళ్ల ఆ కొడుకు వారి సహజీవనానికి అడ్డుగా వారు భావించారు. తరుచూ పిల్లాడిని వేధించారు. చిత్రహింసలు పెట్టారు. ఓ రోజు విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడు.

అన్నమయ్య జిల్లాలో నందలూరు మండలంలోని అరవపల్లెకు చెందిన జహీరున్నీసా, అబ్దుల్లా దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ దంపతులు విడిపోయారు. ఇద్దరు పిల్లలను మదర్సాల్లో చేర్పించారు. మూడో పిల్లాడు షాహిద్‌ తల్లితోనే ఉంటున్నాడు.

మైదుకూరుకు చెందిన మహిళతో లక్ష్మీనారాయణ అనే వ్యక్తితో ఆమె పరిచయం పెంచుకుంది. వారు సహజీవనం చేయచెగువేరా నుంచి గాడ్సే వైపు పవన్.. దళారీ అవతారం: పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలుడం ప్రారంభించారు. వారికి కొడుకు షాహిద్ అడ్డుగా కనిపించాడు. గత నెల 28వ తేదీన ఆమె షాహిద్‌ను చిత్రహింసలు పెట్టింది. నాలుగు రోజుల క్రితం వారిద్దరూ ఇంట్లో తలుపులు వేసి చితకబాదినట్టు స్థానికులు వివరించారు. దీంతో షాహిద్ రెండు రోజుల క్రితం అనారోగ్యం బారిన పడ్డాడు. స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా సీరియస్‌గా ఉందని కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు.

Also Read: 

పోలీసుల అనుమతి లేకపోవడంతో వారు చికిత్సకు నిరాకరించారు. బాలుడు మెట్లపై నుంచి పడిపోవడంతోనే తీవ్ర గాయాలపాలయ్యాడని వారు బుకాయించారు. వైద్యులు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చి చికిత్స ప్రారంభించారు. చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి బాలుడు మరణించాడు. నిర్జీవుడిగా బిడ్డను చూసి తండ్రి అబ్దుల్లా విలవిల్లాడిపోయాడు.