ప్రకాశం జిల్లా కారంచేడులో దారుణం జరిగింది. ఏకాంతం కోసం నిర్మానుష్య ప్రాంతానికి వచ్చిన ప్రేమజంటను నిర్బంధించి ప్రియుడి కళ్లేదుటే ఆమెపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. చీరాల విఠల్‌నగర్‌కు చెందిన ఓ యువతికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది.

అయితే భర్తతో విభేదాలు రావడంతో అతని నుంచి విడాకులు తీసుకుని ప్రస్తుతం తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. అయితే ఉపాధి నిమిత్తం ఓ దుకాణంలో పనిచేస్తున్న ఆమెకు అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది.

దీంతో వారిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వీరిద్దరు బైక్‌పై  కారంచేడు సమీపంలోని వంతెన వద్దకు వెళ్లారు. అక్కడికి కొంచెం దగ్గరలోని పొదల వద్ద మాట్లాడుకుంటుండగా... ముగ్గురు యువకులు బైక్‌పై ద్విచక్రవాహనంపై వారి వద్దకు వచ్చారు.

ప్రేమ జంటను నిర్బంధించి.. ఫోన్లు, నగదు తీసుకున్నారు. అనంతరం యువతిని పక్కకు తీసుకెళ్లి ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం చేశారు. ఈ దారుణం నుంచి తేరుకున్న బాధితురాలు శనివారం కారంచేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.