గుంటూరు జిల్లా, తెనాలి ఐతానగర్ లో అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని తన భర్త ఇంటి ముందు, తల్లి తండ్రులు పిల్లలతో కలిసి కేదారేశ్వరి అనే మహిళ ఆందోళనకు దిగింది. 

ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం త్రోవకుంటకు చెందిన కేదారేశ్వరితో తెనాలి ఐతానగర్ కు చెందిన జితేందర్ రాజుకు 2014 లో వివాహం జరిగింది వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు.  రాజు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అయితే కేదారేశ్వరిని అత్తామామలు రాజు దగ్గరికి వెళ్లనివ్వకుండా తెనాలిలో తమ వద్దే ఉంచుకున్నారు. 

భర్త దగ్గరికి, పుట్టింటికీ వెళ్లనివ్వకుండా అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో కేదారేశ్వరి తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనకు, తన పిల్లలకు న్యాయం జరగాలంటూ అత్తింటి ముందు బైఠాయించి ఆందోళనకు దిగింది.