అనంతపురంలో దారుణం జరిగింది. పెద్దవుడుగూరు మండలం మిడుతూరు గ్రామ సమీపంలో మహిళ దారుణహత్యకు గురైంది
అనంతపురంలో దారుణం జరిగింది. పెద్దవుడుగూరు మండలం మిడుతూరు గ్రామ సమీపంలో మహిళ దారుణహత్యకు గురైంది.
44 వ జాతీయ రహదారి పక్కనే ఉన్న రెస్టారెంట్ సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళను హత్య చేసిన దుండగులు మృతదేహాన్ని దహనం చేశారు. ఈ ఘటనపై రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతురాలిని ఎక్కడో చంపేసి ఇక్కడికి తీసుకొచ్చి దహనం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం వివరాలను సేకరిస్తోంది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. మృతురాలి వయసు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
