నెల్లూరు: అందంతో మత్తెక్కిస్తోంది. కవ్వించే చూపులతో లారీ డ్రైవర్లకు తన అందాన్ని ఎరగా వేస్తోంది. ఆమె అందానికి ఆకర్షితులైన వారిని బుట్టలో వేసుకుని ఆపై ఉడాయిస్తోంది. ఈ నయా దందా నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. 

తన వలపులతో ఎందర్నో బురిడీ కొట్టించిన ఆమె ఎట్టకేలకు పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా సంతపేటకు చెందిన రమాదేవి. రమాదేవికి ఆమంచర్ల గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. 

వృత్తి రీత్యా ఆటో డ్రైవర్ అయిన అనిల్ ఈజీగా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశాడు. తన ప్రియురాలు రమాదేవితో ఈ విషయంపై ఆలోచించి హైవేపై డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశాడు. వలపు వల అనే నయా దందాకు శ్రీకారం చుట్టారు. అందుకు అనిత్ తన మిత్రులు మల్లి శ్రీనివాసులు, వీరేశం బాలవర్థన్ ల సహకారం తీసుకున్నారు. 

రమాదేవికి మేకప్ వేసి రోడ్డుపై నిలబెట్టడం మెుదలుపెట్టారు. రాత్రి 8 గంటల తర్వాత ఈ వ్యవహారం అంతా మెుదలవుతుంది. రోడ్డుపక్కన చీకటిలో ఉంటూ టార్చ్ లైట్ వేస్తూ లారీ డ్రైవర్లను ఆకర్షిస్తోంది. ఆమె అందానికి ఆకర్షితులైన లారీ డ్రైవర్లు ఆమె దగ్గరకు రాగానే పక్కకు వెళ్దామని తీసుకెళ్తోంది. 

అప్పటికే అక్కడ మాటు వేసిన అనిల్ అతని స్నేహితులు అతడిపై దాడి చేసి అతడి దగ్గర ఉన్న సొమ్మును దోచుకుంటారు. ఇలా ఎంతోమంది లారీ డ్రైవర్లు వీరి ఉచ్చులో పడ్డారు. అయితే ఖమ్మం జిల్లాకు చెందిన బత్తుల శివాజీ అనే వ్యక్తి వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కేసు నమోదు చేసిన పోలీసులు వీరిపై నిఘా ఉంచారు. మంగళవారం రాత్రి సుందరయ్య కాలనీ దాటిన తర్వాత రోడ్డుపై తన అందంతో లారీ డ్రైవర్లకు వల వేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక ఆటోతోపాటు రూ.5వేలు, వెండి బ్రాస్ లైట్, ఉంగరం స్వాదీనం చేసుకున్నారు.