Asianet News TeluguAsianet News Telugu

ప్రియుడి మీద మోజుతో.. కన్న కూతురిని కూడా..

ఆ బిడ్డను సదరు  మహిళ అపూరంగా పెంచుకుంది. అయితే.. ఆమె ఇటీవల అనారోగ్యంతో బాధపడుతుండటంతో.. ఆ చిన్నారి పరిస్థితి మరోసారి ప్రశ్నార్థకంగా మారింది.

woman leaves her own daughter over illicit relationship
Author
Hyderabad, First Published Jul 18, 2020, 10:29 AM IST

ఓ మహిళ తల్లి ప్రేమకే మచ్చతీసుకువచ్చింది. ఆమెకు అప్పటికే పెళ్లయ్యింది. ఓ కుమార్తె కూడా ఉంది. అయితే.. అనుకోకుండా భర్త చనిపోయాడు. దీంతో.. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ ప్రియుడి మోజులో.. ఆమెకు కుమార్తె అడ్డుగా తోచింది. దీంతో.. కన్న కూతురనే పేగు బంధం కూడా లేకుండా.. మరో మహిళకు అప్పగించి చేతులు దులుపుకుంది.

అయితే.. ఆ బిడ్డను సదరు  మహిళ అపూరంగా పెంచుకుంది. అయితే.. ఆమె ఇటీవల అనారోగ్యంతో బాధపడుతుండటంతో.. ఆ చిన్నారి పరిస్థితి మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణకు చెందిన ఓ మహిళ భర్త మరణించడంతో ఓ వ్యక్తితో సహజీవనం చేస్తూ గుంటూరులోని పట్టాభిపురంలో ఓ అపార్టుమెంట్‌లో వాచ్‌మెన్‌గా జీవనం సాగిస్తోంది. అక్కడ పనిమనిషితో స్నేహంగా మెలిగింది. కొంత కాలానికి తాము అత్యవసర పనిమీద హైదరాబాదు వెళ్తున్నామని, పాపను చూస్తుండమని చెప్పి కుమార్తెను పనిమనిషికి అప్పగించి వెళ్లిపోయింది.

అనంతరం వారి ఫోన్‌లు పనిచేయలేదు. వారి ఆచూకీ తెలియలేదు. మానవత్వంతో ఆ మహిళ తన పిల్లలతో పాటే సొంత కూతురిలా చూసుకుంది. అయితే కొద్దిరోజులుగా ఆ మహిళ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో తన పిల్లల్ని అమ్మమ్మ ఇంటికి పంపించింది. భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉన్న ఆమె తాను చనిపోతే ఈ బాలిక గతేమిటి అని ఆలోచించి గురువారం పట్టాభిపురం పోలీసుల చెంతకు ఆ చిన్నారిని చేర్చింది.

విషయం మొత్తం తెలుసుకున్న పోలీసులు.. చిన్నారి తల్లి కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios