కిడ్నాప్‌ చేసి దారుణంగా కొట్టి..ఆపై

గుర్తుతెలియని వ్యక్తులు మహిళను కిడ్నాప్‌ చేసి దారుణంగా కొట్టి చంపారు . ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. మోమిడి గ్రామానికి చెందిన దారా రమణమ్మ కోటారెడ్డి రొయ్యలగుంటల వద్ద వంటమనిషిగా చేరి రాత్రివేళల్లో కూడా అక్కడే ఉండేది.

రమణమ్మ ఈనెల 21వ తేదీన అదృశ్యమైంది. రోయ్యల చేపల యజమాని రమణమ్మ అదృశ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులకు కండలేరు క్రిక్‌ కాలువలో రమణమ్మ శవం కనిపించింది. రొయ్యలగుంటల వద్ద వాచ్‌మన్‌గా పనిచేసే ధనుంజయ ఈ ఘాతకానికి పాల్పడి ఉంటాడన్ని మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.