Asianet News TeluguAsianet News Telugu

గెంటేసిన భర్త: న్యాయం చేస్తామని ఇద్దరి అత్యాచారం, నిందితులకు ఎస్సై సాయం

కేసులు పెట్టేందుకు పోలీస్ స్టేషన్‌కు వస్తున్న మహిళలు, యువతుల్ని కొందరు ట్రాప్ చేస్తున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ వివాహితకు మాయమాటలు చెప్పి ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు

woman gang raped in hyderabad
Author
narasaraopet, First Published Mar 23, 2021, 6:59 PM IST

కేసులు పెట్టేందుకు పోలీస్ స్టేషన్‌కు వస్తున్న మహిళలు, యువతుల్ని కొందరు ట్రాప్ చేస్తున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ వివాహితకు మాయమాటలు చెప్పి ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.

వివరాల్లోకి వెళితే.. కనపర్రు గ్రామానికి చెందిన మహిళకు 13 ఏళ్ల క్రితం నరసరావుపేటకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లయిన ఆరేళ్ల తర్వాత భర్తతో మనస్పర్థల కారణంగా ఆమెను భర్త, అత్తమామలు ఇంటి నుంచి గెంటివేశారు. వివాహ సమయంలో పుట్టింటి వారు పెట్టిన బంగారంతో బాధితురాలు బయటకు వచ్చేసింది.

ఈ విషయం తెలుసుకున్న నరసరావుపేటకు చెందిన ఆవుల మస్తాన్‌రావు, కనపర్రుకు చెందిన గుంజి శ్రీనివారావులు వివాహితను పరిచయం చేసుకున్నారు. తాము మీ మధ్య గొడవ సర్దుబాటు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా ఆమె వద్ద ఉన్న 47 సవర్ల బంగారు ఆభరణాలు దాస్తానని తీసుకెళ్లారు.

ఫిర్యాదు చేసేందుకు తాను నరసరావుపేట టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా అక్కడ యడ్లపాడుకు చెందిన ఓ వ్యక్తి పరిచయమై న్యాయం చేస్తానని తనను తీసుకెళ్లాడని బాధితురాలు ఆరోపిస్తోంది. అంతేకాకుండా తాను హోంమంత్రి బంధువునని చెప్పుకుంటూ పోలీసుస్టేషన్ల చుట్టూ తిరుగుతూ పంచాయితీలు చేస్తున్నాడని ఆమె చెప్పారు.

పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో ఓ ఇల్లు  అద్దెకు తీసుకుని తనను అక్కడ ఉంచారని బాధితురాలు తెలిపింది. అక్కడ తనపై ఆ వ్యక్తితో పాటు ఓ కాంగ్రెస్‌ నాయకుడు అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పింది.

అంతేకాకుండా తన నగ్న వీడియోలు తీశారని వాపోయింది. దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని.. రూరల్‌ ఎస్‌ఐ డబ్బులు తీసుకుని తనకు చేయకపోగా, కాంగ్రెస్‌ నాయకుడిపై కేసు కూడా పెట్టలేదని బాధితురాలు ఆరోపించింది. దీంతో ఆమె న్యాయం కోసం జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. 

ఇక మరో కేసు విషయానికి వెళితే.. తన భర్త మరో మహిళను రెండో పెళ్లి చేసుకుని తనను మోసం చేశాడని వజ్రగిరి రమేష్‌ అనే కానిస్టేబుల్‌పై ఆయన భార్య అంజలి ఫిర్యాదు చేసింది. రామిరెడ్డినగర్‌లో ఉంటున్న అంజలికి నకరికల్లుకు చెందిన రమేష్‌కు 2009లో వివాహం జరిగింది.

2016 నుంచి తమ మధ్య విబేధాలు రావడంతో.. 2017లో రమేశ్ అతని మేనమామ కూతురిని రెండో పెళ్లి చేసుకున్నాడని అంజలి ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు విడాకులిస్తే రూ.15 లక్షల నగదు, రెండు ఎకరాలు పొలం ఇస్తానని, తన మేనమామ కూతురిని వదిలేది లేదని తేల్చిచెప్పాడని ఆమె వాపోయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios