పోలీసులు ఎంతగా నిఘా పెట్టి కఠిన చర్యలు చేపడుతున్నా.. కొందరు కిలాడీలు అమాయకులకు టోకరా వేసి లక్షలు కొట్టేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో (kurnool) వ్యాక్సిన్ వేస్తానని ఇంట్లోకి ప్రవేశించిన మాయలేడీ ఏకంగా బంగారు చైన్‌తో పరారైంది

పోలీసులు ఎంతగా నిఘా పెట్టి కఠిన చర్యలు చేపడుతున్నా.. కొందరు కిలాడీలు అమాయకులకు టోకరా వేసి లక్షలు కొట్టేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో (kurnool) వ్యాక్సిన్ వేస్తానని ఇంట్లోకి ప్రవేశించిన మాయలేడీ ఏకంగా బంగారు చైన్‌తో పరారైంది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం నగరంలోని స్టాంటన్‌పురంలో కళావతమ్మ అనే మహిళ ఇంటికి ఓ గుర్తు తెలియని మహిళ వచ్చి కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేస్తానని నమ్మించింది.

వ్యాక్సిన్‌ వేసే ముందుగా కళ్లలో రెండు చుక్కలు మందు వేసుకోవాలని నమ్మబలికింది. దీనికి బాధితురాలు సమ్మతించడంతో కళ్లలో చుక్కలు వేసింది. ఇదే అదునుగా భావించిన నిందితురాలు.. కళావతమ్మ మెడలోని 25 గ్రాముల బరువున్న బంగారు గొలుసును తెంపుకుని ఉడాయించింది. బాధితురాలు గట్టిగా కేకలు వేసుకుంటూ బయటకు వచ్చి ఆమె కోసం వెతికింది. దీంతో అర్బన్‌ తాలూకా పోలీసు స్టేషన్‌ చేరుకుని ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ALso Read:చెడ్డీ గ్యాంగ్ తో ఆ ప్రమాదం లేదు.. అపోహలే.. గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు...

మరోవైపు విజయవాడ నగరంలో దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయకంపితులను చేస్తున్న cheddi gang కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ టి.కె.రాణా తెలిపారు. నగరంలోని Gunadala, Madhuranagar Railway Station ప్రాంతాలను శుక్రవారం ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరంలో చెడ్డీగ్యాంగ్ lock వేసిన ఇళ్లు, విల్లాలు, అపార్ట్మెంట్ లలో దొంగతనాలకు పాల్పడుతూ కలకలం సృష్టిస్తున్న రని.. దీని వలన ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారని అన్నారు త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు.

gujarat రాష్ట్రంలోని చాహోత్ జిల్లా నుంచి చెడ్డి గ్యాంగ్ నగరంలోకి ప్రవేశించింది. గత పది రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతూ సంచరిస్తుంది. కేవలం దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర, తమిళనాడు, kerala రాష్ట్రాల్లో తరచూ ఈ గ్యాంగ్ దోపిడీలు చేస్తుంటారని తెలిపారు. కేవలం రాత్రి సమయాల్లోనే నివాసాల మధ్య తిరుగుతూ చోరీలు చేయటమే వీరి లక్ష్యమని అని వివరించారు.